రాష్ట్రంలో కెమికల్ పార్కుల ఏర్పాటుపై ప్రధానంగా చర్చ
విశాఖపట్నం,నెల్లూరుల్లో సిఐపిఇటి కెమికల్ పార్కులు ఏర్పాటుపై చర్చ
జూలై నెలాఖరున జరిగే గ్లోబల్ కెమికల్ అండ్ పెట్రోకెమికల్స్
మాన్యుఫ్యాక్చురింగ్ హబ్స్ సమిట్ కు ఆహ్వానం
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కెమికల్స్ అండ్ పెట్రోకెమికల్స్ రంగంలో
పెట్టుబడులు పెట్టేందుకు అపారమైన అవకాశాలున్నాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
డా.కెఎస్.జవహర్ రెడ్డి పేర్కొన్నారు. కేంద్ర రసాయన మరియు పెట్రోలికెమికల్స్
శాఖ కార్యదర్శి అరుణ్ బరోకతో కూడిన అధికారుల బృందం శుక్రవారం విజయవాడలోని
సిఎస్ క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్
రెడ్డితో భేటీ అయింది.ఈసందర్భంగా సిఎస్ జవహర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో
ముఖ్యంగా రసాయన, పెట్రోకెమికల్స్ రంగంలో పెట్టుబడులకు గల అవకాశాలను
వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 640 చ.కి.మీలతో కూడిన పెట్రోలియం,కెమికల్స్
అండ్ పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ (పిసిపిఐఆర్)ను కలిగి దేశంలో
నాల్గవ రాష్ట్రంగా ఉందని పేర్కొన్నారు.అంతేగాక రాష్ట్రంలో పెట్టుబడులు
పెట్టేందుకు ముందుకు వచ్చే పెట్టుబడిదారులకు అవాంతరాలు లేని వ్యాపార
వాతావరణాన్ని కల్పించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు సిఎస్
స్పష్టం చేశారు.అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కెమికల్
ఇండస్ట్రీ ప్రధాన భాగస్వామి అయ్యేందుకు గల అవకాశాలపై ఈసమావేశంలో విస్తృతంగా
చర్చించారు. అదే విధంగా రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రవేట్ రంగంలో ఏర్పాటు అవుతున్న
వివిధ ఇండస్ట్రియల్ పార్కులు, పరిశ్రమల సంబంధిత క్లస్టర్ల గురుంచి సిఎస్.జవహర్
రెడ్డి కేంద్ర కార్యదర్శి అరుణ్ బరోక బృందానికి వివరించారు. ఉదాహరణగా తిరుపతి
సమీపంలోని శ్రీ సిటీలో ఎయిర్ కండిషనింగ్ ఉత్పత్తులు తయారీ గురుంచి వివరిస్తూ
రానున్న రోజుల్లో ఇది భారత దేశానికే ఎసి మాన్యు ఫ్యాక్చరింగ్ కాపిటల్ గా
రూపుదిద్దుకోనుందని సిఎస్ జవహర్ రెడ్డి పేర్కొన్నారు.
అంతకు ముందు కేంద్ర రసాయన, పెట్రో కెమికల్స్ శాఖ కార్యదర్శి అరుణ్ బరోక
మాట్లాడుతూ రసాయన ఉత్పత్తుల తయారీలో భారతదేశం ప్రపంచంలోనే 6వదిగాను ఆసియా
ఖండంలో 3వ పెద్ద దేశంగా నిలిచిందని పేర్కొన్నారు.అంతేగాక ప్రస్తుతం ప్రపంచంలో
కెమికల్స్ అండ్ పెట్రోకమికల్స్ ఉత్పత్తిలో భారతదేశం వాటా 178 బిలియన్
డాలర్లుగా ఉండగా వచ్చే 2025 నాటికి 300 బిలియన్ డాలర్ల స్థాయికి చేరేలా
అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు అరుణ్ బరోక పేర్కొన్నారు.ఇండియన్ ట్రేడ్
పోర్టల్ ప్రకారం ప్రస్తుతం దేశంలో ఈరంగంలో 2 మిలియన్ల మంది పనిచేస్తున్నారని
చెప్పారు.
వచ్చే నెలలో జరిగే 3 ఎడిషన్ ఆఫ్ ఇండియా
గ్లోబల్ కెమికల్స్ అండ్ పెట్రోకెమికల్స్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్స్ సమ్మిట్లో
పాల్గొనవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర కార్యదర్సి అరుణ్ బరోక కోరారు.
ఈసమావేశంలో ముఖ్యంగా విశాఖపట్నం,నెల్లూరుల్లో సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్
ప్లాస్టిక్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఇనిస్టిట్యూట్ లే ఏర్పాటుపై కేంద్ర
కార్యదర్శి అరుణ్ బరోక సిఎస్ డా.జవహర్ రెడ్డితో విస్తృతంగా చర్చించారు.వీటి
ఏర్పాటుతో ఈరంగంలో మరింత నైపుణ్యాభివృద్ది మరియు సాంకేతిక సహాయం అందించేందుకు
అన్నివిధాలా అవకాశం కలుగుతుందని చెప్పారు. అంతకు ముందు రాష్ట్ర ఎపిఐఐసి విసి
అండ్ ఎండి మరియు పరిశ్రమల శాఖ కమీషర్, సిఇఓ ఎపి ఇడిబి అండ్ సిఇఓ ఎపి మారిటైం
బోర్డు ప్రవీణ్ కుమార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రాష్ట్రంలో పరిశ్రమల
స్థాపనకు ప్రత్యేకంగా కెమికల్ పార్కులు,ఎస్ఇజడ్ లు ఏర్పాటుకు గల అవకాశాలను
అక్కడ ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాల గురించి వివరించారు. అంతేగాక ప్రస్తుతం
ఆయా ప్రాంతాల్లో సిద్ధంగా అందుబాటులో ఉన్న సౌకర్యాలు పర్యావరణ సంబంధింత ఇతర
ఇకో సిస్టమ్ ల గురించి ప్రవీణ్ కుమార్ వివరించారు. ఈసమావేశంలో రాష్ట్ర
పరిశ్రమలు,వాణిజ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరకల వలవన్,ఆర్ధిక శాఖ
ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్.రావత్ తదితరులు పాల్గొన్నారు.