హైదరాబాద్ : కళాతపస్వి కె.విశ్వనాథ్ ఇంట మరో విషాదం చోటు చేసుకుంది. ఆయన
సతీమణి జయలక్ష్మి(86) ఆదివారం సాయంత్రం కన్నుమూశారు. తీవ్ర అస్వస్థతకు గురి
కావడంతో వెంటనే కుటుంబ సభ్యులు అపోలో ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి
తరలించిన కొద్దిసేపటికే ఆమె చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈనెల 2న
ప్రముఖ దర్శకుడు, కళాతపస్వి కె.విశ్వనాథ్ కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన
చనిపోయిన 24 రోజులకే జయలక్ష్మి కూడా మృతి చెందడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో
మునిగిపోయారు. విశ్వనాథ్ 20 ఏళ్ల వయసులో జయలక్ష్మిని వివాహం చేసుకున్నారు.
అప్పటికి తాను స్థిరపడకపోయినా అమ్మానాన్నలు చెప్పడంతో వివాహానికి
అంగీకరించారు. సినిమా విషయాలను విశ్వనాథ్ ఎప్పుడూ ఇంట్లో చర్చించేవారు కాదు.
‘‘నా భార్య నా సినిమాలు చూసి అలా ఉన్నాయి. ఇలా ఉన్నాయి అని విశ్లేషించదు.
బాగుంది అని మాత్రం చెబుతుంది’’ అంటూ ఓ సందర్భంలో విశ్వనాథ్ తన సతీమణి
గురించి చెప్పారు. వీరికి ముగ్గురు (ఒక అమ్మాయి, ఇద్దరు అబ్బాయిలు) సంతానం.
చిత్ర పరిశ్రమపై ఆసక్తిలేకపోవడంతో వారికి ఇష్టమైన రంగాల్లో స్థిరపడ్డారు.