న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ శాఖల్లో మొత్తం 9.79లక్షల పోస్టులు ఖాళీగా
ఉన్నాయని కేంద్ర మంత్రి వెల్లడించారు. రోజ్గార్ మేళా పేరుతో యుద్ధ
ప్రాతిపదికన ప్రభుత్వ నియామకాలు చేపడుతున్నామని అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి
సంబంధించి వివిధ శాఖల్లో మొత్తం 9.79లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ప్రభుత్వం
వెల్లడించింది. మొత్తంగా గ్రూప్-ఏలో 23,584 పోస్టులు, గ్రూప్-బీ 1,18,807,
గ్రూప్-సీ 8,36,936 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపింది. కేంద్ర ప్రభుత్వ
ఉద్యోగాల ఖాళీలకు సంబంధించి పార్లమెంటు సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేంద్రమంత్రి
జితేంద్ర సింగ్ ఈ వివరాలు వెల్లడించారు. రైల్వేలో 2,93,943, రక్షణ రంగంలో
(సివిల్) 2,64,704, హోం మంత్రిత్వశాఖలో 1,43,536 పోస్టులు ఖాళీగా ఉన్నాయని
చెప్పారు. మార్చి 1, 2021 నాటికి కేంద్ర ప్రభుత్వ శాఖల్లో మొత్తం 40,35,203
పోస్టులు మంజూరు కాగా ఇప్పటివరకు 30,55,876 పోస్టులు భర్తీ అయినట్లు కేంద్ర
మంత్రి వెల్లడించారు. ‘రోజ్ గార్ మేళా’లో యుద్ధ ప్రాతిపదికన నియామకాలు
చేపడుతున్నామని.. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే 1.47లక్షల మందికి నియామక
పత్రాలు అందజేశామని అన్నారు. సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీస్ లోని సెక్షన్
ఆఫీసర్ల కేడర్లో కొరత ఉందని కేంద్ర మంత్రి వెల్లడించారు. జులై 2022 నాటికి
సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీస్ , సెంట్రల్ సెక్రటేరియట్ స్టెనోగ్రాఫర్స్
సర్వీస్ , సెంట్రల్ సెక్రటేరియట్ క్లరికల్ సర్వీస్ లకు సంబంధించిన 8వేల
మంది ప్రమోషన్లు పొందారని చెప్పారు. 2013 నుంచి పేరుకుపోయిన ప్రమోషన్లను భర్తీ
చేశామని, కేవలం న్యాయస్థానం పరిధిలో ఉన్నవి మాత్రమే పెండింగులో ఉన్నాయన్నారు.