విజయవాడ : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ మేడిపండు చందంగా వుందని, పైనాపటారం, లొన లొటారం అన్నట్టుగా వుందని కాంగ్రెస్ రాష్ట్ర మీడియా చైర్మన్ డా.ఎన్ తులసీ రెడ్డి ఎద్దేవా చేసారు. ఈ బడ్జెట్ లో రైతులకు తీరని అన్యాయం జరిగిందని తులసీ రెడ్డి ఆవేదన వెల్లబుచ్చారు. పి.యమ్. కిషాన్ యోజన క్రింద రైతులకిచ్చే ఆర్థిక సహాయాన్ని 6 వేల రూపాయల నుండి 12 వేల రుపాయల వరకు పెంచుతారని రైతులు ఎంతో ఎదురు చూసారు కాని ఒక్క రూపాయి కూడా పెంచలేదు వ్యవసాయనికి గిట్టుబాటూ లేక అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్వాలు చేసుకుంటున్నారు. ఈ నేపధ్యంలో వ్యవసాయ ఋణాలను మాఫీ చేస్తుందని రైతులు ఎంతో ఆశపడ్డారు కాని రైతులు ఆశలు నిరాశలయ్యాయి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మూడలక్షల రూపాయల వరకు వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తుందని తులసీ రెడ్డి అన్నారు.
వంటగ్యాన్ నిలిండర్ ధర 1200 రుపాయల నుండి 500 రుపాయిలకు తగ్గిస్తుందని గృహిణులు చాలా ఆశగా చూసారు. కాని వారి ఆశలను నీరు కార్చారు. ఒక పైసా కూడా తగ్గించలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 500 రూపాయలకే వంట గ్యాస్ సిలెండర్ సరఫరా చేస్తుందని తులసీ రెడ్డి అన్నారు. నిరు పేద కుటుంబాలకు నెలకు కొంత మొత్తాన్ని ప్రతేక్ష ఆర్ధిక సహాయం కింద అందిస్తుందని నిరు పేదలు ఆశపడ్డారు. ఆశలన్నీ ఆడిఆశాలయ్యాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి నిరుపేద కుటుంబానికి నెలకు 6 వేల రూపాయలు ఆర్ధిక సహాయం చేస్తుందని తులసీ రెడ్డి అన్నారు. 14 లక్షల కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఖాళీగా వున్నాయి. ఈ ఖాళీలను బార్తి చేస్తామన్న హామీని ప్రభుత్వం ఇస్తుందని నురుద్యోగ యువత ఎదురు చూసారు. వారి భవిష్యత్తును అంధకారం లోకి నెట్టేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వస్తే ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్వోగాలని భర్తీ చేస్తుందని తులసీ రెడ్డి అన్నారు. కేంద్ర బజ్జేట్ లో ఎపికి తివ్రమైన అన్యాయం జరిగిందన్నారు ప్రత్యేక హోదా ప్రస్తావన లేదు రాయలసీమ, ఉత్తరాంద్రకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజి అంశం ప్రసంగంలో లేక పోవటం శోచనీయం కడప జిల్లా సెయిల్ ఆధ్యర్యంలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం, దుగరాజ పట్నం ఓడ రేవు, పోలవరం, విశాఖ, విజయవాడ మెట్రో, విశాఖ – చెన్నై పారిశ్రామిక కారిడార్, కాకినాడ పెట్రో కెమికల్ కాంప్లెక్స్ తదితర అంశాల ప్రస్తావనే లేదు. ఒక్క మాటలోచెప్పాలంటే మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేంద్ర బజ్జేట్ లో ప్రజలకు మట్టిముంత ఇచ్చి ప్రజల నుండి వెండి చెంబు లాకున్నట్టు ప్రజాలకు చాక్లెట్ ఇచ్చి వారి నుండి నక్లెస్ లాకున్నట్టు వుందని ఘాటుగా విమర్శించారు.