అవకాశాలు కన్పిస్తున్నాయి. దీనిపై చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ పార్టీ
నేతలతో కీలక భేటీ నిర్వహించారు. ప్రధాని నివాసంలో జరిగిన ఈ భేటీలో బీజేపీ
జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, హోం మంత్రి అమిత్ షా తో పాటు పలువురు సీనియర్
నేతలు పాల్గొన్నారు. దాదాపు ఐదు గంటల పాటు ఈ సమావేశం జరిగింది. వచ్చే ఏడాది
లోక్సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీ వ్యూహాలపై ప్రధానంగా
చర్చించినట్లు తెలుస్తోంది. ఇక కేంద్ర మంత్రి వర్గంలోనూ భారీ మార్పులకు ఈ
భేటీలో చర్చ జరిగినట్లు సమాచారం.
ఇటీవల పార్టీ అధ్యక్షుడు నడ్డా, హోంమంత్రి అమిత్ షా, పార్టీ ప్రధాన కార్యదర్శి
బీఎల్ సంతోష్ రాష్ట్రాల వారీగా నేతలతో సమావేశాలు జరిపారు. లోక్సభ, పలు
రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా రాష్ట్ర స్థాయిలో సంస్థాగత మార్పులు
చేపట్టాలని పార్టీ భావిస్తోంది. తాజా సమావేశంలో దీనిపై సుదీర్ఘంగా చర్చలు
జరిపినట్లు సమాచారం. దీంతో త్వరలోనే రాష్ట్ర స్థాయుల్లో బీజేపీ అధ్యక్షుల్లో
మార్పులు ఉండొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక మరికొద్ది రోజుల్లో కేంద్ర
మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉండొచ్చని సమాచారం. ఎన్నికలకు ముందు వ్యతిరేకత
ఎదుర్కొంటున్న మంత్రులను తప్పించి కొత్తవారిని మంత్రివర్గంలోకి తీసుకునే
అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ భేటీ, అందులో చర్చించిన అంశాలపై భాజపా
నేతలు ఇంతవరకూ స్పందించలేదు. ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ
ఓటమిపాలైన విషయం తెలిసిందే. మరోవైపు, ఈ ఏడాది చివరల్లో మధ్యప్రదేశ్,
రాజస్థాన్, ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఈ
నాలుగింట్లో కేవలం ఒక రాష్ట్రంలో మాత్రమే భాజపా అధికారంలో ఉంది. వచ్చే ఏడాది
లోక్సభ ఎన్నికలకు ముందు జరిగే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా మెజార్టీ
దక్కించుకోవాలని కాషాయ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. క్షేత్ర స్థాయిలో మరింత
మద్దతు కూడగట్టుకునేందుకు.. గత నెల కేంద్ర మంత్రులు, పలువురు సీనియర్ నేతలు
ప్రధాని మోదీ తొమ్మిదేళ్ల పాలనను పురస్కరించుకుని నెల రోజుల పాటు ప్రత్యేక
కార్యక్రమాలు చేపట్టిన విషయం తెలిసిందే.