న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ నూతన అధ్యక్షుడు కిషన్ రెడ్డి
బుధవారం ఢిల్లీలో ఉండి కూడా కేబినెట్ సమావేశానికి హాజరుకాకపోవడం ఒక్కసారిగా
కలకలం రేపింది. ఆయనను తెలంగాణ అధ్యక్ష పదవిని అప్పగించిన అనంతరం అసలు ఆయన
ఎక్కడా స్పందించింది లేదు. మీడియా ముందుకు సైతం వచ్చేందుకు నిరాకరిస్తున్నారు.
అయితే ఆయన తన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసినట్టు పెద్ద ఎత్తున ప్రచారం
జరుగుతోంది. నిజానికి కిషన్ రెడ్డి బీజేపీ జాతీయ అధ్యక్ష పదవిని ఆశించినట్టు
తెలుస్తోంది. బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి ఈసారి దక్షిణాదికి వస్తుందని కిషన్
రెడ్డి భావించినట్టు సమాచారం. ఈ క్రమంలోనే జేపీ నడ్డా తరువాత తనకే బీజేపీ
పగ్గాలు అప్పగిస్తారని భావించినట్టు తెలుస్తోంది. అలాంటిది తెలంగాణ బీజేపీ
అధ్యక్ష బాధ్యతలు అప్పగించి అధిష్టానం చేతులు దులుపుకోవడంతో ఆయన మనస్తాపం
చెందినట్టు సమాచారం. పైగా ప్రస్తుతం తెలంగాణలో బీజేపీకి అంత అనుకూల
పరిస్థితులు లేవు. కర్ణాటక ఎన్నికల ఫలితాలకు ముందు వరకూ రెండో స్థానంలో
కొనసాగిన బీజేపీ ఇప్పుడు మూడో స్థానానికి పడిపోయిందన్న ప్రచారం జోరుగా
సాగుతోంది. ఈ తరుణంలో రాష్ట్రంలో పార్టీ బాధ్యతలు తీసుకుంటే రాజకీయంగా
మునుగుతామని తన అనుచరులతో కిషన్ రెడ్డి చెప్పినట్టు సమాచారం. మొత్తంగా ఆయన
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడి బాధ్యతలు స్వీకరించేందుకు ఏమాత్రం సుముఖంగా లేరని
తెలుస్తోంది. ఈ క్రమంలోనే కిషన్ రెడ్డి అలకబూనినట్టు సమాచారం.