న్యూఢిల్లీ : ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు కేంద్రం మరో షాకిచ్చింది. సీఎం
అధికారిక నివాసం పునర్నిర్మాణంలో అవకతవకల ఆరోపణలపై కాగ్ (కంప్ట్రోలర్ అండ్
ఆడిటర్ జనరల్) ఆడిట్ జరపనుంది. మే 24న లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) వీకే
సక్సేనా పంపిన నోట్ ఆధారంగా కాగ్ ప్రత్యేక ఆడిట్‌కు కేంద్ర హోంశాఖ సిఫార్సు
చేసింది. ఈ విషయాన్ని రాజ్ నివాస్ అధికార వర్గాలు తెలిపాయి. గతంలోనే ఢిల్లీ
సీఎం అధికారిక నివాసం పునర్నిర్మాణంలో అవకతవకలు జరిగాయని ఎల్జీ ఆరోపించారు.
కాగ్‌తో ఆడిట్ చేయించాలని లేఖ రాశారు. దీనిపై చర్యలు తీసుకున్న కేంద్ర హోంశాఖ
స్పెషల్ ఆడిట్ నిర్వహించాలని కాగ్‌కు సూచించింది. ఢిల్లీ సివిల్ లైన్స్‌లో
ఉన్న సీఎం అధికారిక నివాసాన్ని ఢిల్లీ ప్రభుత్వ పరిధిలోని ప్రజాపనులశాఖ
పునర్నిర్మించింది. దానికి మొదట రూ.20 కోట్ల వరకూ ఖర్చవుతుందని అంచనా వేశారు.
ఆ తరువాత అంచనాలు పెంచుతూ మొత్తం రూ.53 కోట్లు ఖర్చు చేశారు. దీనిపై ఎల్జీ
ఇప్పటికే ప్రధాన కార్యదర్శితో విచారణ జరిపించారు. తాజాగా కాగ్ ఆడిట్‌కు
సిఫార్సు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఓడిపోతామన్న నిరాశతోనే బీజేపీ ప్రభుత్వం
కాగ్ ఆడిట్‌కు సిఫార్సు చేసిందని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది.