నిర్మాణ తుది దశ పనులను పరిశీలించిన మంత్రి
హైదరాబాద్ : హుస్సేన్ సాగర్ ఒడ్డున రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా
నిర్మిస్తున్న తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం ఫినిషింగ్ పనులను శనివారం
రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు.
నిర్మాణ ప్రాంగణమంతా కలియ తిరుగుతూ అధికారులకు, వర్క్ ఏజెన్సీకి పలు సూచనలు
చేశారు. ప్రధాన ద్వారం,ఫౌంటైన్,ల్యాండ్ స్కేప్ ఏరియా, గ్రీనరి, పార్కింగ్
ఏరియా,నిర్మాణ లోపలి భాగంలో ఆర్ట్ గ్యాలరీ,ఆడియో విజువల్ రూం,పై అంతస్తుకు
వెళ్లేందుకు ఏర్పాటు ఎస్కలేటర్,లిఫ్ట్ లు పరిశీలించారు. కన్వెన్షన్ సెంటర్,పైన
రెస్టారెంట్ పనులు పరిశీలించి పలు సూచనలు చేశారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈనెల 22న సీఎం కేసిఆర్ గారి చేతుల మీదుగా తెలంగాణ
అమర వీరుల స్మారక చిహ్నం ప్రారంభించుకోనున్న నేపథ్యంలో మిగిలిన ఫినిషింగ్
వర్క్స్ వేగంగా పూర్తి చేసి ప్రారంభానికి సిద్దం చేయాలని ఆదేశించారు. అమరుల
త్యాగాలు ప్రతిబింబించేలా నిరంతరం జ్వలించే జ్వాలా ఆకృతి దీపం వద్ద లైటింగ్ ను
పరిశీలించి సూచనలు చేశారు. యావత్ తెలంగాణ ప్రజల మది నిండా నిలిచే నిర్మాణమని
అధికారులు, వర్క్ ఏజెన్సీ అదే రీతిలో తుది మెరుగుల్లో సీఎం కేసిఆర్ ఆలోచనలకు
అనుగుణంగా పూర్తి చేయాలని మంత్రి స్పష్టం చేశారు. మంత్రి వెంట ఆర్ అండ్ బి
ఈఎన్సి గణపతి రెడ్డి,సి.ఈ మోహన్ నాయక్,ఎస్.ఈ లు హఫీజ్,లింగా రెడ్డి, ఎ.ఈ ధీరజ్
రెడ్డి,నిర్మాణ సంస్థ ప్రతినిధులు కొండల్ రెడ్డి,శిల్పి రమణారెడ్డి తదితరులు
ఉన్నారు.