మార్చేశారు. రెండు నెలలుగా ఇదిగో..అదిగో అంటూ ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి
జాబితాపై ఊరిస్తూనే వస్తున్నారు. మొదట జూన్‌లో అని.. ఆ తర్వాత జూలై-10, 12
తారీఖుల్లో అని, ఆ తర్వాత ఆగస్టు 12 లేదా 13 తారీఖు జాబితా ప్రకటన ఉంటుందనే
పుకార్లు షికార్లు చేశాయి. అన్నీ అనుకున్నట్లు జరిగుంటే ఇవాళ జాబితా బయటికి
రావాల్సి ఉంది. ఇంతవరకూ ఎక్కడా బీఆర్ఎస్లో చలీ చప్పుడే లేదు. తాజాగా
అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ముచ్చటగా మూడోసారి జాబితా విడుదలపై
తేదీ మార్చేశారట సార్.! దీనికి చాలానే కారణాలున్నాయట. ఇంతకీ ఆ తేదీ ఎప్పుడు..?
ఆ డేట్‌నే బాస్ ఎందుకు ఫిక్స్ చేయాల్సి వచ్చింది..? తొలి జాబితాలో ఎంతమంది
అభ్యర్థుల పేర్లు ఉంటాయి..? అన్న దానిపై జోరుగా చర్చలు సాగుతున్నాయి.
వరుసగా మూడోసారి అధికారం దక్కించుకోవాలని బీఆర్ఎస్, ఈసారి
ఎట్టిపరిస్థితుల్లోనూ గెలిచి తీరాలని కాంగ్రెస్ రానున్న ఎన్నికల కోసం రెండు
పార్టీలు తమ కార్యాచరణకు పదును పెడుతున్నాయి. అధికార పీఠం కోసం తీవ్రంగా పోటీ
పడుతున్న ఈ రెండు పార్టీలు అభ్యర్థుల ఎంపిక కసరత్తును ముమ్మరం చేశాయి. ఈ
నెలలోనే తొలి జాబితాను విడుదల చేసేందుకు బీఆర్ఎస్ సర్వం సిద్ధం చేసింది. అంతా
సవ్యంగా సాగుంటే అధికార బీఆర్ఎస్ తొలి జాబితా ఆగస్టు 12 లేదా13న 87 మందితో
విడుదల కావాల్సి ఉంది. అయితే.. కేసీఆర్‌కు ఎందుకో సెంటిమెంట్ ప్రకారం
ముందుకెళ్లాలని భావించి ఈనెలలో అభ్యర్థుల ప్రకటనను వాయిదా వేసేశారట. బీఆర్ఎస్
వర్గాల నుంచి అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు సెప్టెంబర్6న రిలీజ్
చేయాలని నిశ్చయించుకున్నారట. వాస్తవానికి 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లిన
కేసీఆర్.. సెప్టెంబరు-07న 105 మందితో తొలి జాబితాను విడుదల చేశారు. కొద్ది
మందికి తప్ప సిటింగ్‌లందరికీ టికెట్లు ఇచ్చారు. ప్రతిపక్షాలు తేరుకునే లోపే
అభ్యర్థులతోపాటు పార్టీ యంత్రాంగం మొత్తం ముందస్తుగానే ప్రచారంలోకి
దిగిపోయింది. ఈసారి కూడా కేసీఆర్ అదే వ్యూహాన్ని అమలు చేసే యోచనలో ఉన్నట్లు
తెలుస్తోంది.. కానీ ఒక్కరోజు ముందు అంటే సెప్టెంబర్ 6న అభ్యర్థుల జాబితా
ప్రకటించి ఆ తర్వాత ఎన్నికల కదనరంగంలోకి దూకాలని బీఆర్ఎస్ హైకమాండ్ ప్లాన్
చెబుతున్నారు . కేసీఆర్ లక్కీ నంబర్ కూడా 6 అనే విషయం తెలిసిందే. ఇలాగైతే
అన్నీ కలిసొస్తాయన్నది బీఆర్ఎస్ భావిస్తోందని సమాచారం.
కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ గ్రాఫ్ఎం త పెరిగిపోయిందో
ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కొన్ని సర్వేలు సైతం ఈసారి కాంగ్రెస్ అధికారమని
తేల్చిచెప్పేశాయి. ఈ క్రమంలో కేసీఆర్ ఆచితూచి అడుగులేస్తున్నారట. కాంగ్రెస్
38 మందితో తమ తొలి జాబితాను ఈ ఆగస్టు చివర్లో ప్రకటించే అవకాశం ఉందని
తెలుస్తోంది. ఆ తర్వాత సెప్టెంబర్ మొదటివారంలో మరో జాబితాను రిలీజ్ చేయడానికి
సన్నాహాలు చేస్తోంది కాంగ్రెస్. ఇలా కాంగ్రెస్ జాబితాలు ప్రకటించిన తర్వాత
సెప్టెంబర్-06న తన సెంటిమెంట్‌ను పండించనున్నారట గులాబీ బాస్. ఆ రోజే 87
మందితో తొలి జాబితాను రిలీజ్ చేస్తారట. ఎందుకంటే.. ఏయే నియోజకవర్గంలో
ప్రత్యర్థుల ప్లస్ ఏంటి.. మైనస్‌లు ఏమున్నాయ్..? అని బేరీజు చేసుకొని ఆ
తర్వాతే రిలీజ్ చేయాలన్నది కేసీఆర్ ఆలోచనట. అంతేకాదు 28 మంది అభ్యర్థులను
మారుస్తారనే టాక్ కూడా నడుస్తోంది. మరోవైపు.. ఈనెల 17 నుంచి శ్రావణ మాసం
ప్రారంభం కానుండటంతో.. మంచి ముహూర్తం చూసుకొని ఏ క్షణమైనా తొలి జాబితాను
రిలీజ్ చేసే యోచనలో కూడా కేసీఆర్ ఉన్నారని టాక్ నడుస్తోంది. ఇందుకోసం మంత్రులు
హరీష్ రావు, కేటీఆర్‌లతో గత మూడ్రోజులుగా ఎర్రవల్లిలోని ఫామ్‌హౌజ్‌లో కేసీఆర్
సమాలోచనలు చేస్తున్నట్లు తెలియవచ్చింది. లిస్ట్‌కు తుది మెరుగులు
దిద్దుతున్నట్లు కూడా వార్తలు గుప్పుమంటున్నాయి. మొత్తానికి చూస్తే కేసీఆర్‌కే
క్లారిటీ లేదని తాజా సమాచారాన్ని బట్టి చూస్తే అర్థమవుతోంది. ఎందుకంటే 2018
సెంటిమెంట్ ప్రకారం ముందుకెళ్లాలా.? లేకుంటే ఈ రెండు మూడ్రోజుల్లోనే మంచి
ముహూర్తం చూస్కోని జాబితా ప్రకటించాలా? అనేదానిపై గులాబీ బాస్ సమాలోచనలు
చేస్తున్నారట. అసలే. రాజకీయ చాణక్యుడిగా పేరుగాంచిన కేసీఆర్ ఎప్పుడు ఎలాంటి
నిర్ణయాలు తీసుకుంటారో ఎవరికీ ఊహకందవనే పేరుంది. కేసీఆర్ నుంచి ఎప్పుడు ప్రకటన
వస్తుందా అని సిట్టింగ్‌లు, ఆశావహులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారట.
మరి తొలి జాబితాలో ఉండే ఆ సిట్టింగ్‌లు ఎవరు..? ఆశావహుల్లో ఎవరెవరికి టికెట్
దక్కుతుంది..? అనే విషయాలు తెలియాలంటే మరికొన్నిరోజులు వేచి చూడాల్సిందే.