పైసల్ కలెక్షన్ చేసేందుకు పనికి వస్తాడు : కోమటిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు
హరీశ్ రావుకు ఏమైనా సబ్జెక్ట్ ఉందా? అంటూ మంత్రి కోమటిరెడ్డి ఆగ్రహం
కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజినీర్ కేసీఆరే…డిజైనర్ కేసీఆరే…కాంట్రాక్టర్ కూడా కేసీఆరేనని ఎద్దేవా
కాంట్రాక్టర్ల వద్ద డబ్బులు వసూళ్లు చేయడానికి మాత్రమే హరీశ్ రావు పనికి వస్తాడని తీవ్ర వ్యాఖ్య
హైదరాబాద్ : గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చి (శాసనసభకు) మాట్లాడితే మంచిగా ఉండు. ఈయన (హరీశ్ రావు) పోస్ట్‌మ్యాన్. ఈయన ఏం చేస్తాడు సర్. హరీశ్ రావు ఏంది..పైసల్ కలెక్షన్ చేసేందుకు పనికివస్తాడు. ఈయనకు ఏమైనా సబ్జెక్ట్ ఉందా?’ అని మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి విమర్శించారు. నీటి పారుదల రంగంపై తెలంగాణ ప్రభుత్వం శనివారం అసెంబ్లీలో శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. ఈ అంశంపై చర్చ సందర్భంగా వెంకటరెడ్డి మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజినీర్ కేసీఆరే…డిజైనర్ కేసీఆరే…కాంట్రాక్టర్ కూడా కేసీఆరేనని ఎద్దేవా చేశారు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి సమాధానం చెప్పాలని, హరీశ్ రావును కేసీఆర్ కలెక్షన్ల కోసం మాత్రమే వాడుకుంటారన్నారు. కాంట్రాక్టర్ల వద్ద డబ్బులు వసూళ్లు చేయడానికి మాత్రమే హరీశ్ రావు పనికి వస్తాడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆయనకు అవగాహన లేదని,. ఇలాంటి కలెక్షన్ కింగ్ చెబితే మేం వినాలా? ఇది మా ఖర్మ సర్ అన్నారు. హరీశ్ రావు చెబితే మేం వినాలా? అని వ్యాఖ్యానించారు.