హైదరాబాద్ : తెలంగాణ ప్రజల దృష్టంతా ఖమ్మం జిల్లా కేంద్రంలో నిర్వహించే సభపైనే
ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఈ సభ విజయవంతం అయితే
రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉందన్నారు. ఖమ్మం జిల్లాలో ఈనెల 15న జరిగే
బీజేపీ భారీ బహిరంగ సభ ఏర్పాట్లు గురించి జిల్లా పోలింగ్ బూత్ సభ్యులతో బండి
సంజయ్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కేసీఆర్ గుండెల్లో డప్పులు మోగేలా ఖమ్మం
బహిరంగ సభను సక్సెస్ చేయాలని పార్టీ కార్యకర్తలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
బండి సంజయ్ పిలుపునిచ్చారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా పార్టీ పోలింగ్ బూత్ సభ్యులతో
ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన బండి సంజయ్ తెలంగాణ
ప్రజల దృష్టంతా ఖమ్మం జిల్లా కేంద్రంలో నిర్వహించే సభపైనే ఉందని
అభిప్రాయపడ్డారు. ఈ సభ విజయవంతం అయితే రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉందన్నారు