శ్రీశైలం : శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో రెండోరోజు ఆదివారం
శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లు భృంగివాహనంపై భక్తులకు
దర్శనమిచ్చారు. అష్టాదశ శక్తిపీఠాల్లో ఆరవశక్తి పీఠం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో
రెండవదైన శ్రీశైలమహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా
జరుగుతున్నాయి. భ్రామరి సమేతుడైన ముక్కంటీశుడు త్రిశూలధారియై భృంగివాహనంపై
విహరించారు. శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రెండోరోజు వైభవంగా
సాగాయి. చండీశ్వరపూజ, మండపారాధన, కలశార్చన, శివపంచాక్షరీ, జపానుష్టానాలు,
రుద్రపారాయణాలు శాస్త్రోక్తంగా జరిగాయని ఈవో లవన్న తెలిపారు.
సాయంకాలార్చనలు, హోమాల తర్వాత అక్క మహాదేవి అలంకార మండపంలో స్వామి
అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించిన భృంగి వాహనంపై వేంచేబు చేసి షోడశోపచార
పూజలు చేశారు. మంగళ వాయిద్యాలు, డప్పుచప్పుళ్లతో క్షేత్ర ప్రధాన వీధుల్లో
ఊరేగించారు..నయనానందకరంగా ఉత్సవం
ఉత్సవం గంగాధర మండపం నుండి నంది మండపం వరకు, నందిమండపం నుండి బయలు వీరభధ్ర
స్వామి వరకు ఆద్యంతం నయనానందకరంగా సాగింది. స్వామి అమ్మవార్లకు అత్యంత
సన్నిహితులైన చెంచు కళాకారుల జానపదాలు, కోలాటాలు, రాజభటుల వేషాలు, జాంజ్
పథక్, గొరవ నృత్యం, బుట్టబొమ్మలు, భీరప్పడోలు, నందికోలసేవ, ఢమరుకం,
చిడతలు,శంఖం, చెక్కబొమ్మలు వివిధ రకాల విన్యాసాల సందడితో ఊరేగింపు కొనసాగింది.
ఉత్సవ అనంతరం కాళరాత్రిపూజ మంత్రపుష్పంతోపాటు స్వామి అమ్మవార్లకు ఆస్థానసేవ
జరిగింది. గ్రామోత్సవంలో ఆలయ ట్రస్ట్‌బోర్డ్ చైర్మెన్ రెడ్డి వారి చక్రపాణి
రెడ్డి, ఈఓ లవన్న, ధర్మకర్తల మండలి సభ్యులు, ఈఈ రామకృష్ణ, పౌరసంబంధాల అధికారి
శ్రీనివాసరావు, ఏఈఓలు హరిదాస్, ఫణీంధ్రప్రసాద్, శ్రీశైల ప్రభ సంపాదకులు
అనీల్‌కుమార్, చీఫ్ సెక్యురిటీ ఆఫీసర్ అయన్న, సూపరింటెండెంట్ రవి,
స్వాములు, వెంకటేశ్వరులు, మధుసూదనరెడ్డి తదితరులు పాల్గొన్నారు.