మరో రూ.500కోట్లు కేటాయించనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. కొండగట్టు
పర్యటనలో భాగంగా స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆలయ పునర్నిర్మాణం,
అభివృద్ధిపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్
మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి ఇప్పటికే రూ.100కోట్లు ప్రకటించామని.. మరో
రూ.500కోట్లు (మొత్తం రూ.600కోట్లు) కూడా కేటాయించనున్నట్లు వెల్లడించారు.
దేశంలోనే ప్రముఖ ఆంజనేయ క్షేత్రంగా కొండగట్టును తీర్చిదిద్దాలని అధికారులకు
సీఎం సూచించారు.కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయాన్ని ఆగమశాస్త్ర పద్ధతులను అనుసరించి
అభివృద్ధి చేయాలని, భక్తుల సౌకర్యార్థం పునర్నిర్మాణాలను చేపట్టాలని
ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. భారతదేశంలోనే గొప్పదైన ఆంజనేయ
స్వామి దేవాలయం ఎక్కడున్నదంటే కొండగట్టు అంజన్న ఆలయం పేరు వినపడేలా అత్యంత
గొప్పగా, అన్ని హంగులతో, సకల సౌకర్యాలతో తీర్చిదిద్దాలని అధికారులను సీఎం
కేసీఆర్ ఆదేశించారు. అత్యంత సుందరమైన ప్రకృతి రమణీయత, అభయారణ్యంతో కూడిన
కొండగటట్టు ఆలయాన్ని సుందరంగా తీర్చి దిద్ది, దేశవ్యాప్తంగా ఉన్న హనుమాన్
భక్తులు దర్శించుకునేందుకు అనువుగా కార్యాచరణ రూపొందిచేలా బుధవారం నాడు
కొండగట్టు అంజన్న సన్నిదిలో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశాన్ని సీఎం కేసీఆర్
నిర్వహించారు.
ఈ సమీక్ష సమావేశంలో మంత్రులు, కొప్పుల ఈశ్వర్, ఇంద్రకరణ్ రెడ్డి, గంగుల
కమాలకర్, ఎంపి దివకొండ దామోదర్ రావు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్
కుమార్, స్థానిక ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తో పాటు, ఎమ్మెల్యేలు రసమయి
బాలకిషన్, బాల్క సుమన్, జీవన్ రెడ్డి, సంజయ్, కె. విద్యాసాగర్ రావు, కోరుకంటి
చందర్, మండలి చీఫ్ విప్ భాను ప్రసాద రావు, ఎమ్మెల్సీ ఎల్ రమణ, మాజీ ఎమ్మెల్సీ
నారదాసు లక్షణ రావు, ఎఫ్ డిసి చైర్మన్ అనిల్ కూర్మాచలం, సివిల్ సప్లైస్
కార్పోరేషన్ ఛైర్మన్ రవీందర్ సింగ్, డిసిసిబి ఛైర్మన్ అల్లోల శ్రీకాంత్ రెడ్డి
, గెల్లు శ్రీనివాస్ యాదవ్, సీఎంఓ అధికారులు భూపాల్ రెడ్డి, స్మితా సబర్వాల్,
ఆర్ అండ్ బి అధికారులు గణపతి రెడ్డి, రవీందర్ రావు, మిషన్ భగీరథ ఈఎన్సీ
కృపాకర్ రెడ్డి, కలెక్టర్ యాస్మిన్ భాషా, ఆలయ స్తపతి ఆనందర్ సాయి, వాస్తు
సలహాదారు సుద్దాల సుధాకర్ తేజ, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, దేవాదాయ శాఖ
అధికారులు, ఆలయ ఈఓ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.