నెల్లూరు : ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తమిళనాడు
మాజీ గవర్నర్ కోణిజేటి రోశయ్య కాంస్య విగ్రహాన్ని నెల్లూరులో ఏర్పాటు చేయాలని
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన స్వాతంత్ర సమరయోధులు కేవీ
చలమయ్య విజ్ఞప్తి చేశారు. ఆయన వర్ధంతిని పురస్కరించుకుని ఆదివారం ఘనంగా
నివాళులర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తనకు రోశయ్యతో గల స్నేహ సంబంధాలను
గుర్తు చేశారు 2008లో నెల్లూరు జిల్లాను పొట్టి శ్రీరాములు జిల్లాగా మార్చిన
ఘనత ఆయనకే దక్కుతుందన్నారు రాష్ట్ర వ్యవసాయ సహకార శాఖా మంత్రి కాకాణిగోవర్ధన
రెడ్డి నగర శాసనసభ్యులు, మాజీ మంత్రి డా.అనిల్ కుమార్ యాదవ్, రూరల్ శాసన
సభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నగర మేయర్ పొట్లూరి స్రవంతి ఈ విషయంలో
కార్పొరేషన్ లో ప్రత్యేక తీర్మానం ద్వారా రోశయ్య కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు
చేయవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో సంఘ నేతలు ఆర్ వి శరత్చంద్ర నేత్ర
వైద్యులు డా.రవీంద్రనాథ్ సొల్లేటి కోటేశ్వరరావు, సోమిశెట్టి. వెంకటరత్నం,
రాయవరపు కళ్యాణ చక్రవర్తి, నరసింహారావు, పేర్ల. జనార్ధన్, సిహెచ్
వెంకటేశ్వర్లు, ఆర్ శేషగిరి తదితరులు పాల్గొన్నారు.