రెడ్డి, జగదీష్ రెడ్డి
ఆధ్యాత్మిక దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంత్రులు
యాదాద్రి – భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట వ్రత మండపంలో వేడుకలు
హైదరాబాద్ : రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా బుధవారం రాష్ట్ర
వ్యాప్తంగా అన్ని ఆలయాల్లో ఆధ్యాత్మిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
యాదాద్రి – భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట వ్రత మండపంలో దేవాదాయ శాఖ
ఆధ్వర్యంలో నిర్వహించిన ఆధ్యాత్మిక దినోత్సవ వేడుకల్లో దేవాదాయ శాఖ మంత్రి
ఇంద్రకరణ్ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ
సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 2,043 దేవాలయాలకు ధూప దీప నైవేద్య
పథకం అమలుకు శ్రీకారం చుట్టారు. అర్చకులకు ధూప దీప నైవేద్య నియామక పత్రాలను
అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాకముందు
తెలంగాణ వచ్చిన తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయో మనమందరం చూస్తున్నాం. తెలంగాణ
రాష్ట్రం ఆవిర్భవించి తొమ్మిది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర
ప్రభుత్వం ఘనంగా దశాబ్ది ఉత్సవాలను నిర్వహిస్తుంది. ఆధ్యాత్మిక చింతన కలిగిన
ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాంత
సాంప్రదాయలకు ఆలయాలకు , పండుగలకు, వేడుకలకు అత్యంత ప్రాధన్యత
కల్పించడంతో ఆధ్మాత్మిక వైభవం ఉట్టిపడుతుంది. స్వరాష్ట్రం ఏర్పడిన
తర్వాత మన పండుగలకు, వేడుకలకు ప్రపంచ ఖ్యాతి లభించింది.
స్వపరిపాలనలో తెలంగాణ స్వంత ఆస్థిత్వంతో కూడిన ఆధ్యాత్మిక శోభను
సంతరించుకుంది. ఉమ్మడి పాలనలో తెలంగాణ ప్రాంతం ఆధ్యాత్మికంగా నిరాధారణకు
గురైంది. సమైక్య రాష్ట్రంలో కేవలం 1805 ఆలయాలకు ధూప దీప నైవేద్య పథకం అమలు
చేస్తే ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు గారు 6,641 ఆలయాలకు ఈ పథకాన్ని
విస్తరించారు. దీంతో అర్చకుల జీవన విధానంలో ఎంతో వృద్ధి కనపడుతుంది. ధూప దీప
నైవేద్య పథకం ద్వారా అర్చకుల వేతనాలను రూ.6,000 నుంచి రూ.10,000 లకు
పెంచుతామని సీయం కేసీఆర్ నిర్ణయించారు. దేశంలోనే అత్యంత పురాతన
పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా పేరొందిన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని
దాదాపు రూ.1,200 కోట్ల వ్యయంతో పునర్నిర్మించడం జరిగింది. దక్షిణ కాశీగా
వెలుగొందుతున్న వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ అభివృద్ధి
పనుల కోసం వీటీడీఏ 35 ఎకరాల భూమిని సేకరించింది. ఇప్పటి వరకు వేములవాడ
ఆలయ అభివృద్ధి విస్తరణకు రూ. 70 కోట్లు ఖర్చు చేశాం. అంతే కాకుండా
వేములవాడ అభివృద్ధికి రూ. 50 కోట్లు, యదాద్రి అభివృద్ధికి రూ. 200 కోట్లను
ఈ బడ్జెట్ లో కేటాయించడం జరిగింది. కొండగట్టు అంజన్న ఆలయ అభివృద్ధికి రూ.
500 కోట్లను సీఎం కేసీఆర్ మంజూరు చేశారు. కామన్ గుడ్ ఫండ్, స్పెషల్
డెవలప్మెంట్ ఫండ్ ద్వారా అనేక ఆలయాలను అభివృధ్ధి చేసుకుంటున్నాం. అర్చకులకు,
ఆలయ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా
వేతనాలను చెల్లిస్తున్నాం. భక్తుల వసతుల కల్పన కోసం అనేక కార్యక్రమాలను అమలు
చేస్తున్నాము. ఆన్ లైన్ సేవలను అందుబాటులోకి తెచ్చాము. ఇలా ఆధ్యాత్మికంగా
ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నాము. అభివృద్ధి
సంక్షేమంతో పాటు ఆధ్యాత్మికంగా ఎంతో అభివృద్ధి చేసిన సీఎం కేసీఆర్
నేతృత్వంలోని బీఆర్ఎస్ మూడవసారి గెలిపించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది.
మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ కొంతమంది ఏసీ గదిలో కూర్చుని అభివృద్ధి ఎక్కడ
జరిగిందని ప్రశ్నిస్తున్నారు. అభివృద్ధి ఎక్కడ జరిగిందో సంక్షేమ పథకాలు ఎక్కడ
అమలవుతున్నాయో అక్కడే దశాబ్ది ఉత్సవాలను ప్రజల సమక్షంలో ఘనంగా
నిర్వహించుకుంటున్నాం. గత తొమ్మిదేళ్లలో జరిగిన అభివృద్ధి ప్రతిపక్షాల కళ్ళకు
కనపడటం లేదు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం ఎంతో
పురోగతి సాధించింది. కరెంటు కష్టాల నుంచి బయటపడ్డాం. మంచినీటి కష్టాలు తీరాయి
ఫ్లోరైడ్ రక్కసి సమస్య నుంచి ఉమ్మడి నల్గొండ జిల్లా బయటపడింది. వ్యవసాయ రంగంలో
గణనీయ ప్రగతిని సాధించాం. సంక్షేమ పథకాల అమలుతో బడుగు, బలహీన వర్గాల
జీవితాల్లో వెలుగులు నింపాం. ఆధ్యాత్మిక భావాలను పెంపొందించడంతో సమాజంలో
శాంతి సామరస్యాలు నెలకొంటాయి. ఈ క్రమంలో ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు
అభివృద్ధి సంక్షేమ పథకాలతో పాటు ఆధ్యాత్మిక అభివృద్ధికి అధిక
ప్రాధాన్యతనిస్తున్నారు అన్ని మతాలను సమానంగా గౌరవిస్తున్నారు. అంతకుముందు
యాదగిరిగుట్ట – రాయగిరి లో రూ.12 కోట్ల వ్యయంతో నిర్మించనున్న వేద పాఠశాలకు
మంత్రులు భూమిపూజ చేశారు. అన్నదాన సత్రాన్ని అనంతరం
ప్రెసిడెన్షియల్ సూట్ సమీపంలో నిర్మించిన కళ్యాణ మండపాన్ని
ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు పైళ్ళ శేఖర్ రెడ్డి,
గొంగిడి సునీత రెడ్డి, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, జడ్పీ చైర్మన్
సందీప్ రెడ్డి, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, కలెక్టర్ పమేలా సత్పతి, ఇతర
అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.