ప్రపంచంలోనే అత్యంత ధనికుడి స్థానం నుంచి ఎలన్ మస్క్ కొద్దిసేపు రెండవ
స్థానంలోకి పడియాడు. ఫోర్బ్స్ జాబితాలో ఆయన రెండో స్థానానికి దిగజారడం
విశేషం. టెస్లా షేర్లు భారీగా పతనం కావడం, ట్విటర్‌ను 44 బిలియన్ డాలర్లతో
కొనుగోలు చేసిన నేపథ్యంలో.. ఆయన సంపద కరిగిపోయి ఈ పరిణామం చోటు చేసుకుంది.
అయితే ఎలన్ మస్క్ రెండో స్థానంలోకి చేరిన వేళ.. ప్రపంచంలో అత్యధిక
ధనవంతుడిగా ఫ్రెంచ్ వ్యాపార దిగ్గజం బెర్నార్డ్ అర్నాల్ట్ నిలిచినట్లు
ఫోర్బ్స్ ప్రకటించింది. అయితే, ఈ పరిణామం మారడానికి ఎంతో టైం
పట్టలేదు. వ్యక్తిగత సంపదను పెంచుకుని మస్క్ మళ్లీ మొదటి స్థానానికి
చేరుకున్నాడు. ఫోర్బ్స్ జాబితా ప్రకారం.. అర్నాల్ట్ సంపద విలువ 184.7
బిలియన్ డాలర్లు కాగా, మస్క్ సంపద 185.4 బిలియన్ డాలర్లకు చేరుకుంది.