ఎన్నో రకాల లాభాలు ప్రయోజనాలు ఉన్నాయి.అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
1.లేత కొబ్బరిలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.ఇందులో ఫైబర్, మాంగనీస్, ఐరన్,
జింక్, ఫాస్పరస్, పొటాషియం వంటి మినరల్స్ పుష్కలంగా ఉంటాయి.
2.దీనిలోని మీడియం-చైన్ ట్రైగ్లిజరైడ్స్, లారిక్ యాసిడ్ మన ఆరోగ్యానికి
మేలుచేస్తాయి.
3.లేత కొబ్బరిలో అధికంగా ఉండే ఫైబర్ కంటెంట్ పేగుల కదలికను ప్రోత్సహిస్తుంది.
తద్వారా, జీర్ణవ్యవస్థను క్రమబద్ధీకరిస్తుంది.
4.లేత కొబ్బరి గట్ బ్యాక్టీరియను బలంగా మారుస్తుంది, గట్ మైక్రోబ్స్ ను
పెంచుతుంది.
5.దీంతో ఎసిడిటీ, గ్యాస్, అజీర్తి, మలబద్ధకం వంటి సమస్యలు దూరం అవుతాయి.
6.లేత కొబ్బరిలోని కొవ్వు విటమిన్ ఏ, విటమిన్ కె, విటమిన్ డి విటమిన్ ఇ వంటి
కరిగే పోషకాలు సమర్థవంతంగా గ్రహిస్తుంది.
7.లేత కొబ్బరిలో మీడియం-చైన్ ట్రైగ్లిజరైడ్స్ ఉంటాయి. ఇవి గుండె సమస్యల ముప్పు
పెంచే చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలను తగ్గిస్తాయి.
8.లేత కొబ్బరి తింటే రక్తంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది. ఇది
గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. అలాగే ఇది గుండె ఆరోగ్యానికి మేలు
చేస్తుంది.
9.లేత కొబ్బరిలోని లారిక్ యాసిడ్ హైపర్ టెన్షన్ ను కంట్రోల్లో ఉంచుతుంది.