కొవిడ్-19 మహమ్మారితో వణికిపోయిన ప్రపంచ దేశాలు.. ఇప్పుడిప్పుడే దాని ప్రభావం
నుంచి బయటపడుతున్నాయి. ఇదే సమయంలో వైరస్ ల వ్యాప్తి కట్టడిపై పలు దేశాలు
అలసత్వం వహిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పలు రకాల వైరస్
లు, వ్యాధికారకాలు ప్రస్తుతం అత్యధిక వేగంతో వ్యాపిస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య
సంస్థ (WHO) హెచ్చరించింది. ముఖ్యంగా కొవిడ్-19, ప్లూతోపాటు ఇతర వ్యాధి
కారకాలు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయని.. పౌరులు ఆరోగ్య జాగ్రత్తలు పాటిస్తూ
సురక్షితంగా ఉండాలని సూచించింది. ఈ క్రమంలో బూస్టర్ డోస్‌ల వాడకానికి అధిక
ప్రాధాన్యత ఇవ్వాలని, సమూహాలకు వందశాతం పూర్తి అయ్యేలా కొవిడ్-19 టీకాలను
పూర్తి చేయాలని డబ్ల్యు హెచ్ ఓ సూచించింది. కొవిడ్ -19 మహమ్మారికి సంబంధించి
అంతర్జాతీయ ఆరోగ్య నిబంధనలు పాటించాలని సూచించింది. టీకాపై శ్రద్ధ వహించాలని
అత్యవసర కమిటీ పద్నాలుగో సమావేశంలో WHO డైరెక్టర్ జనరల్ ఇటీవల ఏకగ్రీవంగా
తీర్మానించారు. కొనసాగుతున్న COVID-19 మహమ్మారికి సంబంధించి కమిటీ అందించిన
సలహాతో WHO డైరెక్టర్ జనరల్ ఏకీభవించారు. కరోనా మహమ్మారి బహుశా పరివర్తన దశలో
ఉందన్న కమిటీ అభిప్రాయాలతో డైరెక్టర్ జనరల్ అంగీకరించారు. ఈ పరివర్తనను
జాగ్రత్తగా నావిగేట్ చేయడానికి, సంభావ్య ప్రతికూల పరిణామాలను తగ్గించడానికి
కమిటీ సలహాను అభినందిస్తున్నా మన్నారు.