వాహన లైసెన్స్ ప్లేట్లపై ప్రభుత్వ నిర్ణయాన్ని పాటించని పోలీసు అధికారిని తొలగించినందుకు నిరసనగా కొసావోలోని సెర్బ్ మైనారిటీ సభ్యులు శనివారం తమ పదవులకు రాజీనామా చేశారు. ఉత్తర కొసావోలో ఒక సీనియర్ సెర్బ్ పోలీసు అధికారి తన వాహనం లైసెన్స్ ప్లేట్లను నిబంధనల మార్పు ప్రకారం కొసావో జారీ చేసిన వాటికి అనుగుణంగా మార్చడానికి నిరాకరించాడు. దీంతో కొసావో సార్వభౌమాధికారం చుట్టూ వివాదాస్పద సమస్యలు మొదలయ్యాయి. ముఖ్యంగా ఉత్తరాన నివసించే సెర్బ్ మైనారిటీలలో కొసావోలోని అనేక సెర్బ్ మైనారిటీలు మాజీ సెర్బ్ ప్రావిన్స్ స్వతంత్రంగా కాకుండా సెర్బియాలో భాగంగా ఉండాలని కోరుకుంటున్నారు. కొసోవర్ రాజధాని, అధికార కేంద్రమైన ప్రిస్టినా అధికారాన్ని వారు గుర్తించలేదు. నంబర్ ప్లేట్ మార్పు మంగళవారం నుంచి అమల్లోకి వచ్చింది. అయితే అమలు క్రమంగా ఉంటుందని కొసావో అధికారులు తెలిపారు. రాబోయే మూడు వారాల్లో, సెర్బ్‌లు తమ పాత సెర్బియన్ లైసెన్స్ ప్లేట్లను ఉంచుకుంటే హెచ్చరికలతో వదిలేస్తారు. దీని తర్వాత వచ్చే రెండు నెలల్లో జరిమానాలు విధిస్తారు. ఆపై ఏప్రిల్ 31 వరకు వారు తాత్కాలిక స్థానిక ప్లేట్లతో మాత్రమే డ్రైవ్ చేయవచ్చు. ఈ నిర్ణయాలపై ఒక సెర్బ్ ప్రభుత్వ మంత్రి, 10 మంది ఎంపీలు, పోలీసు, న్యాయవ్యవస్థలోని అధికారులు అందరూ సెర్బ్ల ఆధిపత్యం ఉన్న నాలుగు ప్రాంతాలలో రాజీనామా చేశారు.