అమరావతి : గత కొన్నిరోజులుగా వైసీపీలో ఫోన్ ట్యాపింగ్ అంశం తీవ్ర దుమారం
రేపుతోంది. ఉమ్మడి నెల్లూరు జిల్లా నేతలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం
రామనారాయణరెడ్డి తమ ఫోన్లు ట్యాప్ చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఈ
వ్యవహారంపై ఏపీ పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ స్పందించారు. కోటంరెడ్డి
టీడీపీ అధినేత చంద్రబాబును కలిసింది నిజం కాదా? అని నిలదీశారు. అడ్డంగా
దొరికిపోవడంతో ఫోన్ ట్యాపింగ్ అంటూ ఆరోపణలు చేస్తున్నాడని మండిపడ్డారు. వార్డు
మెంబర్ గా కూడా గెలవలేని కోటంరెడ్డిని సీఎం జగన్ ఎమ్మెల్యేగా గెలిపించారని,
కానీ కోటంరెడ్డి విశ్వాసం చూపించేది ఇలాగేనా? అని ఆదిమూలపు సురేశ్
ప్రశ్నించారు. కోటంరెడ్డి వ్యవహారంలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి
రామకృష్ణారెడ్డి కూడా స్పందించారు. లోకేశ్ పాదయాత్ర అట్టర్ ఫ్లాప్ కావడంతో,
దాన్నుంచి దృష్టి మరల్చేందుకు చంద్రబాబు పన్నిన ఎత్తుగడే ఈ ఫోన్ ట్యాపింగ్
వ్యవహారం అని అన్నారు. అందుకోసం శ్రీధర్ రెడ్డిని వాడుకుంటున్నాడని
ఆరోపించారు. కోటంరెడ్డి, ఆనం వంటి వారు వెళ్లిపోయినా పార్టీకి వచ్చిన నష్టమేమీ
లేదని పిన్నెల్లి అభిప్రాయపడ్డారు.