హైదరాబాద్ : స్వాతంత్ర వజ్రోత్సవాల ముగింపు వేడుకల సందర్భంగా రాష్ట్ర
ప్రభుత్వం నిర్వహించిన కోటి వృక్షార్చనలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్
మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ) సోమవారం రికార్డు స్థాయిలో మొక్కలు నాటింది.
ఎంఏయుడి స్పెషల్ చీఫ్ సెక్రటరీ, హెచ్ఎండిఏ మెట్రోపాలిటన్ కమిషనర్ అర్విoద్
కుమార్ పర్యవేక్షణలో హెచ్ఎండిఏ యంత్రాంగం, అర్బన్ ఫారెస్ట్ ఉద్యోగులు,
సిబ్బంది ఆయా ప్రాంతాల్లో స్థానిక ప్రజా ప్రతినిధులు, పాఠశాల విద్యార్థులతో
మొక్కలు నాటి కోటివృక్షార్చనలో కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
కోటి వృక్షార్చనలో ప్రభుత్వం 2.70లక్షల మొక్కలు నాటాలని హెచ్ఎండిఏకు
లక్ష్యాన్ని నిర్దేశించగా, హెచ్ఎండిఏ అర్బన్ ఫారెస్ట్ డైరెక్టర్ డాక్టర్
బి.ప్రభాకర్ కోటి వృక్షార్చన కార్యక్రమానికి కార్యాచరణను రూపొందించి టార్గెట్
2.70లక్షలు అధిగమించి సోమవారం నాడు తొమ్మిది(9) కేంద్రాలలో ఏకంగా రికార్డు
స్థాయిలో 4.13లక్షల మొక్కలు నాటి హెచ్ఎండిఏ ప్రతిష్టతను ఇనుమడింపచేశారు.
కూకట్
పల్లి ఐడిఎల్ చెరువు (రంగధామునిచెరువు) పరిసరాల్లో హెచ్ఎండిఏ సెక్రెటరీ
పి.చంద్రయ్య మొక్కలు నాటి హెచ్ఎండిఏ పరిధిలో కోటి వృక్షార్చనకు శ్రీకారం
చుట్టారు. మిగతా ప్రాంతాలలో అర్బన్ ఫారెస్ట్ అధికారులు చెట్లశ్రీనివాస్,
విష్ణువర్ధన్ రెడ్డి, వీరేశం, రాణిరుద్రమ, సలేహఅఫ్రోజ్, జ్ఞానసుందర్, శశిధర్ ల
ఆధ్వర్యంలో హెచ్ఎండిఏ ఉద్యోగులు, సిబ్బంది మొక్కలు నాటే కార్యక్రమాన్ని
విజయవంతంగా పూర్తి చేశారు.