అమరావతి : కోడికత్తి కేసులో నిందితుడు శ్రీను బెయిల్ పిటిషన్పై తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. హత్యాయత్నం కేసులో నాలుగున్నరేళ్లకు పైగా నిందితుడు జైల్లో మగ్గుతున్నాడని, బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ గతంలో ఎన్ఐఏ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించడంతో ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సీఎం జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పకుండా విచారణ ప్రక్రియ ఆలస్యం అయ్యేలా చేస్తున్నారని, దీంతో నిందితుడు జైల్లోనే మగ్గుతున్నాడని పిటిషనర్ తరఫు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తెచ్చారు. హత్యాయత్నం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఇంతకాలం జైల్లో ఉండటం సరికాదని కోర్టుకు వివరించారు. వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది