హీరోగా తన తొలి చిత్రం పేరు భైరవి అని రజనీకాంత్ వెల్లడించారు. ఎన్టీఆర్
నటించిన పాతాళభైరవి సినిమా గుర్తుకొచ్చి భైరవి సినిమాలో హీరో పాత్రకు
ఒప్పుకున్నానని తెలిపారు. ఎన్టీఆర్ ను స్ఫూర్తిగా తీసుకుని సినిమాల్లోకి
వచ్చానని వివరించారు. పలు చిత్రాల్లో ఎన్టీఆర్ ధుర్యోధనుడి పాత్ర చూసి
ఆశ్చర్యపోయానని అన్నారు. 1977లో ఎన్టీఆర్ తో కలిసి టైగర్ అనే చిత్రంలో
నటించానని రజనీకాంత్ గుర్తు చేసుకున్నారు.”నాపై ఎన్టీఆర్ ప్రభావం చాలానే ఉంది. అప్పట్లో గద పట్టుకుని ఎన్టీఆర్ ను
అనుకరించేవాడిని. దానవీరశూరకర్ణలో ఎన్టీఆర్ లా ఉండాలనుకున్నాను. ఓసారి
ఎన్టీఆర్ లా మేకప్ వేసుకుని ఫొటో దిగి నా స్నేహితుడికి చూపిస్తే, కోతిలా
ఉన్నావని అన్నాడు. అప్పుడు అనిపించింది… ఎన్టీఆర్ లా ఉండడం నా వల్ల కాదని!
ఎన్టీఆర్ క్రమశిక్షణ పాటించేవారు” అని రజనీకాంత్ వివరించారు.వందేళ్ల క్రితం
వెలిగిన ఓ వెలుగు తెలుగు జాతికి వెయ్యేళ్ల వైభవం తెచ్చిందని హిందూపురం
ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ అన్నారు.
విజయవాడలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల అంకురార్పణ సభ ఘనంగా జరిగింది. ఈ
కార్యక్రమంలో బాలకృష్ణ మాట్లాడారు. తెలుగు వాళ్లమని గర్వంగా చెప్పుకునేలా
ఎన్టీఆర్ గుర్తింపు తెచ్చారన్నారు. ఎన్టీఆర్ సంక్షేమానికి శ్రీకారం చుట్టి
సరికొత్త చరిత్ర సృష్టించారన్నారు. ఈ శతజయంతి వేడుకల కార్యక్రమంలో చంద్రబాబు,
రజనీకాంత్, బాలకృష్ణ, నందమూరి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

అంతకుముందు, ఎన్టీఆర్ శతజయంతి వేడుకల అంకురార్పణ సభలో పాల్గొనేందుకు
రజనీకాంత్ కూడా గన్నవరం చేరుకున్నారు. విమానాశ్రయానికి చేరుకున్న రజనీకాంత్
ను బాలకృష్ణ ఆలింగనం చేసుకొని స్వాగతం పలికారు. ఎన్టీఆర్ శతజయంతి అంకురార్పణ
కార్యక్రమానికి వచ్చినందుకు రజనీకాంత్ కు ధన్యవాదాలు తెలిపారు. గన్నవరం ఎయిర్
పోర్టు నుండి రజనీకాంత్, బాలకృష్ణ ఒకే కారులో నోవాటెల్ హోటల్ కు చేరుకున్నారు.