భువనేశ్వర్ : ప్రమాదానికి గురైన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఏపీకి చెందిన
వారి వివరాలను రైల్వే శాఖ వెల్లడించింది. కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌లో షాలిమర్‌లో
39 మంది, సంత్రగచిలో ఆరుగురు, ఖరగ్‌పూర్‌లో ముగ్గురు రైలు ఎక్కినట్లు
అధికారులు తెలిపారు. ప్రమాదానికి గురైన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలులో
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారి వివరాలను రైల్వే శాఖ వెల్లడించింది. కోరమాండల్
ఎక్స్‌ప్రెస్‌లో మొత్తం 178 మంది ఆంధ్రప్రదేశ్‌కు చేరాల్సిన ప్రయాణికులు
ఉన్నారు. 1AC – 9, 11 AC – 17, 3A – 114, స్లీపర్ క్లాస్‌లో 38మంది
ప్రయాణించారు. విజయవాడలో దిగాల్సిన వారు 33 మంది ఉండగా ఏలూరులో దిగాల్సిన వారు
ఇద్దరు, తాడేపల్లి గూడెంలో ఒకరు, రాజమహేంద్రవరంలో దిగాల్సిన వారు 12 మంది
ఉన్నట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు. ఏపీకి చెందిన ప్రయాణికుల ఫోన్
నంబర్లు, ప్రయాణించిన కోచ్, బెర్తుల వివరాలను విజయవాడ స్టేషన్‌లోని హెల్ప్
లైన్ కేంద్రానికి అధికారులు పంపారు.

విజయవాడ మీదుగా వెళ్లే 21 రైళ్ల రద్దు : ఒడిశా రైలు ప్రమాద నేపథ్యంలో విజయవాడ
మీదుగా ఇవాళ, రేపు నడిచే 21రైళ్లును అధికారులు రద్దు చేశారు. మరో 11 రైళ్లను
దారి మళ్లించారు. దీంతో వచ్చి వెళ్లే ప్రయాణికులతో విజయవాడ రైల్వే స్టేషన్
రద్దీగా మారింది. రైళ్ల రద్దు, దారి మళ్లింపుతో ప్రయాణికులు అవస్థలు
పడుతున్నారు.