– వైసీపీ శ్రేణుల్లో రెట్టింపు ఉత్సాహం
– సభ సక్సెస్‌పై ప్రతిపక్షాల్లో ఆందోళన
– పల్లెల నుంచి తరలివచ్చిన ప్రజలు
వెంకటగిరి: తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో సామాజిక సాధికార బస్సు యాత్ర వెంకటగిరి నియోజకవర్గ ప్రజలకు పోలేరమ్మ జాతరను తలపించింది. నేదరుమల్లి బంగ్లా నుండి రాపూరు వరకు సాగిన ఈ యాత్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ డెవలప్మెంట్ బోర్డ్ చైర్మన్,వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి సినీ హాస్యనటుడుఆలీ,వీరి ఆధ్వర్యంలో జన సమూహం మధ్య పూల వర్షాలతో సాగింది. పట్టణంలో ప్రజలు కెక్కిరిసి ఎటు చూసినా జన సందోహం తరలివస్తున్న జనాలు ఇది యాత్ర లేక జాతర అన్న సందేహం ప్రజలకు కలిగింది. పోలేరమ్మ కో ప్రత్యేక పూజలు నిర్వహించి రామ్ కుమార్ రెడ్డి అమ్మ ఆశీస్సులు అందుకున్నారు. అక్కడినుండి పాత బస్టాండ్ మీదుగా పాల కేంద్ర సెంటర్ రాపూరు క్రాస్ రోడ్డు అంగన్వాడి కార్యకర్తలు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. అంగన్వాడిలు సాధికార యాత్రను అడ్డుకోవడం జరిగింది. అనంతరం తిరుపతి పార్లమెంట్ సభ్యులు గురుమూర్తి చొరవతో మీ సమస్యలను రాష్ట్ర అధిష్టానానికి తెలియజేస్తానని తెలపడంతో యాత్ర అక్కడినుండి రాపూర్‌కు కదిలింది. డక్కిలి రోడ్ షోలో సినీ నటుడు ఆలీ మాట్లాడుతూ హలో డక్కిలి నా పేరు ఆలీ మీ ఊర్లోనే ఉంది లి అంటూ ప్రజలు నవ్విస్తూ రాయలసీమ ప్రజలు సామాన్యులు కాదు మంచికొస్తే మంచి చేస్తారు లేకపోతే తొక్క తీస్తానని విధంగా కథ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి 175 సీట్లు 151 సీట్లు గెలిపించి ముఖ్యమంత్రి చేసిన మీరు తేడా వస్తే కత్తిరిస్తారనేది కూడా ఈ ప్రాంత ప్రజలు చేస్తారనిఅన్నారు. రామన్న మంచివారని ఆయన అత్యధిక మెజార్టీతో గెలిపించి జగన్మోహన్ రెడ్డికి కానుకగా మనం ఇవ్వాల్సిన బాధ్యత ఉందని తెలియజేశారు. తన తండ్రి జనార్దన్ రెడ్డి మనసున్న వ్యక్తిని అందర్నీ ఆప్యాయంగా నవ్వుతూ పలకేస్తారని, సినిమా ఇండస్ట్రీ కూడా ఆయన ఎంతో కృషి చేశారని అందుకే వారంటే మాకెంతో గౌరవం తెలిపారు. ఈ యాత్రలో స్థానిక ఎమ్మెల్సీ మేరుగ మురళి, తిరుపతి పార్లమెంటు సభ్యులు గురుమూర్తి, నెల్లూరు మేయర్, జిల్లా గ్రంధాల శాఖ చైర్మన్ దంత శారద, సిపాయి సుబ్రమణ్యం, తదితరులు ఉన్నారు. ఇదిలా ఉండగా వెంకటగిరి నియోజకవర్గంలో వైసీపీ బస్సుయాత్ర విజయవంతం కావడంపై ప్రతిపక్ష పార్టీల్లో కలవరం మొదలైంది. వేలాదిగా తరలివచ్చిన జనాన్ని చూసి వైసీపీకి ఏమాత్రం క్రేజ్ తగ్గలేదని చర్చించుకోవడం కనిపించింది. ఇక మరో వైపు సభ సక్సెస్ కావడంతో వైసీపీ శ్రేణుల్లో రెట్టింపు ఉత్సాహం వచ్చినట్లయింది.