విశాఖపట్నం : కేవలం రాజకీయ విమర్శలు చేయడానికే ఉత్తరాంధ్ర చర్చ జరిగిందని
మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఉత్తరాంధ్ర చర్చా వేదిక పేరిట కోల్డ్
స్టోరేజ్, డార్క్ రూం లీడర్స్ సమావేశం పెట్టారని మండిపడ్డారు. వీరిలో
కొందరికి ఉత్తరాంధ్రతో సంబంధమే లేదన్నారు. చంద్రబాబును సీఎం చేయాలన్నదే
వీళ్లకు ముఖ్యం అన్నారు. కొణతాల రామకృష్ణ టీడీపీ తరపున పనిచేస్తూ
వైఎస్సార్సీపీపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ
మేరకు ఆయన మాట్లాడుతూ ‘చర్చా వేదికలో అసలు ఉత్తరాంధ్ర కేంద్రంగా పరిపాలన
రాజధాని అంశాన్ని చర్చిస్తారని అనుకున్నాం. కానీ ఎక్కడా రాజధానిపై చర్చే
జరగలేదు. సీపీఐ పార్టీని రామకృష్ణ చంద్రబాబు పార్టీ ఆఫ్ ఇండియాగా మార్చారు.
కొణతాల రామకృష్ణ తటస్తులు కాదు. ముసుగు వేసుకున్న టీడీపీ నాయకుడు. అయ్యన్న
పాత్రుడు వయసు మీద పడిన దశలో అరగంట మాట్లాడి కంట నీరు వస్తే భావోద్వేగానికి
గురైనట్టు కొన్ని టీవీలు చూపించాయి. ప్రైవేట్ భూములు దోచారని అవాస్తవపు
ప్రచారం చేస్తున్నారు. కానీ ప్రభుత్వ భూములు దోచుకున్నది ఎవరో జనానికి తెలుసు.
గీతం యూనివర్సిటీ ఎవరిది..?. ప్రభుత్వం భూములు దోచుకున్నది మీ పార్టీ నాయకుడే.
ఎంతో కాలం మంత్రిగా పని చేసిన అయ్యన్న ఉత్తరాంధ్రకు ఏం చేశారో చెప్పాలి. ఐటి
సెజ్, మెడికల్ కాలేజ్‌లు ఎప్పుడైనా ఏర్పాటు చేశారా?. బాక్సైట్ కోసం జీవో
ఇచ్చింది ఎవరు ? టీడీపీ ఇచ్చిన తవ్వకాల జీవో రద్దు చేయాలని చింతపల్లిలో
ప్రతిపక్ష నాయకునిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సభకు హాజరయ్యారు. వెనుకబడిన
జిల్లాల అభివృద్ధికి రూ. 350 కోట్లు కేంద్రం ఇస్తే ఆ డబ్బు అమరావతిలో
పెట్టారు. ఆపై కేంద్రం యుటిలిటీ సర్టిఫికేట్ అడిగితే సమాధానం లేదు. వెనుకబడిన
జిల్లాల నిధులు అమరావతిలో ప్రింటర్లు, స్కానర్లు కొన్నారు. విశాఖలో
జరుగుతున్న, జరగబోయే సదస్సులు ప్రతి పక్ష నాయకులకు కనిపించడం లేదా?’ అని
మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు.