గుంటూరు : వైద్య ఆరోగ్య శాఖపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష చేపట్టారు. ప్రత్యేకంగా కోవిడ్ అప్రమత్తతపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు అధికార యంత్రాంగానికి కీలక ఆదేశాలు జారీ చేశారు. కోవిడ్ పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సీఎం జగన్ సూచించారు. దేశంలో పలు రాష్ట్రాలో కరోనా ఛాయలు మళ్లీ కనిపించడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. దీనిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం ఇటీవలే పలు మార్గదర్శకాలను సూచించింది.
ఈ సమీక్ష సమావేశానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని, సీఎస్ జవహర్ రెడ్డి, ప్రిన్సిపాల్ సెక్రెటరీ కృష్ణబాబు, వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి జీ ఎస్ నవీన్ కుమార్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ జె నివాస్, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ సీఈఓ ఎం ఎన్ హరీందిర ప్రసాద్, ఏపీఎంఎస్ఐడీసీ వీసీ అండ్ ఎండీ డి మురళీధర్‌రెడ్డి ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.