కోవిడ్ మహమ్మారి తీవ్రతతో దేశవ్యాప్తంగా చిన్నపిల్లల తల్లిదండ్రులు అధిక సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. ఫిబ్రవరి 2022లో మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ సంకలనం చేసిన గణాంకాల ప్రకారం కోవిడ్-19 సమయంలో అనాథలుగా మారిన దాదాపు 10, 386 మంది పిల్లల్లో 718 మంది మహారాష్ట్ర వాసులే. ఒడిశా తర్వాత భారతదేశంలో రెండవ అత్యధిక పిల్లల సంఖ్య ఇదే కావడం గమనార్హం.