బంగ్లాదేశ్‌లో కూడా టీమ్ ఇండియా క్రికెట్ జట్టు పర్యటన అనంతరం తీవ్ర విమర్శలను
ఎదుర్కొంటోంది. వరుస వైఫల్యాలపై నెటిజన్లు సైతం విపరీతంగా ట్రోల్
చేస్తున్నారు. ఈ క్రమంలో వెటరన్ స్టార్ కపిల్ దేవ్ కనీసం నలుగురు లేదా ఐదుగురు
మ్యాచ్‌ను మార్చే స్థితిలో ఉండాలని కోరుకున్నారు. పెద్ద టోర్నమెంట్లలో గెలవడం
అంత సులభం కాదని, అయినప్పటికీ జట్టును అన్ని రకాలుగా పటిష్ఠంగా, బలోపేతంగా
మార్చాలని కపిల్ దేవ్ అభిప్రాయపడుతున్నారు. ప్రతీ మ్యాచ్ లోనూ విరాట్,
రాహుల్‌పై మాత్రమే ఆధారపడినట్లయితే రాబోయే ప్రపంచకప్‌ను ఆశించడం చాలా కష్టమని
అతను చెప్పారు. క్లిష్ట పరిస్థితిని మార్చడానికి ప్రతిసారీ జట్టు కనీసం
నలుగురు లేదా ఐదుగురు ఆటగాళ్లు మ్యాచ్‌ను చేజిక్కించుకునేలా క్రికెటర్లు తయారు
కావాలని కపిల్ పిలుపునిచ్చారు. జట్టులోని యువ ఆటగాళ్లు కూడా తమ సమర్థతను
నిరూపించుకోవాలని ఆయన అభిప్రాయపడుతున్నారు.