10 మంది సజీవ దహనం
భయంతో ఐదో అంతస్తు నుంచి జంప్
దక్షిణ ఆసియా దేశం కంబోడియాలోని ఓ క్యాసినో హోటల్లో ఘోర అగ్నిప్రమాదం
సంభవించింది. బుధవారం అర్ధరాత్రి జరిగిన ఈ విషాద ఘటనలో 10 మంది
సజీవదహనమయ్యారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. పయోపెట్లోని గ్రాండ్
డైమెండ్ హోటల్లో ఈ ప్రమాదం జరిగింది. అగ్నీ కీలక భారీగా ఎగిసిపడ్డాయి. వందల
మంది అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నప్పటికీ మంటలు ఆర్పేందుకు
తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ప్రమాద సమయంలో మొత్తం 400 మంది క్యాసినోలో
ఉన్నారు. అగ్నిప్రమాదం సంభవించిన వెంటనే వారంతా భయంతో పరుగులు తీశారు.
కొందరైతే అగ్నిమాపక సిబ్బంది కాపాడేందుకు వెళ్తున్నా ప్రాణభయంతో ఐదో అంతస్తు
నుంచి కిందకు దూకేశారు. ప్రమాద సమయంలో విదేశీయులు కూడా లోపల ఉన్నట్లు
తెలుస్తోంది.