తాడేపల్లిగూడెం : తాడేపల్లిగూడెం టౌన్ లో జరిగిన క్రిస్మస్ పర్వదిన వేడుకలకు హోం శాఖ మంత్రి తానేటి వనిత ముఖ్య అతిథిగా విచ్చేసారు. బేతెల్ రిఫార్మ్డ్ చర్చ్ మందిరంలో జరిగిన సెలెబ్రేషన్స్ కు క్రైస్తవ సోదరులు, స్థానిక వైస్సార్సీపీ నాయకులు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. యేసుక్రీస్తు కృప రాష్ట్ర ప్రజలందరిపైనా ఉండాలని ప్రార్తించినట్లు హోంమంత్రి తెలిపారు. ప్రభువైన ఏసు క్రీస్తు చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ పయనించాలని పేర్కొన్నారు. ప్రజలందరు సంతోషంగా, ఆనందంగా క్రిస్మస్ పండుగను జరుపుకోవాలని హోం మినిస్టర్ వనిత తెలిపారు.