తిరుపతి : తిరుపతిలో శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఆవరణలో నిర్వహించిన
66వ రాష్ర్ట స్ధాయి రోల్ బాల్ క్రీడా పోటీలు రసవత్తరంగా జరిగాయి. ఈ పోటీలను
రాష్ర్ట నలుమూలలు నుండి అన్ని జిల్లాల క్రీడాకారులు పాల్గొన్నారు. ఈరాష్ర్ట
స్ధాయి పోటీల ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిదిగా రాష్ర్ట పర్యాటక, క్రీడా,
సాంస్కృతిక, యువజనాభివృద్ది శాఖా మంత్రి ఆర్కే రోజా పాల్గోన్నారు. మంత్రి రోజా
క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ యువత క్రీడలపట్ల ఆశక్తి చూపడం వల్ల మంచి
శారీరక దారుఢ్యం, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవచ్చని తెలిపారు.
రాష్ర్ట ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించడానికి అన్ని విధాల సహాయసహకారాలు
అందిస్తామని మంత్రి రోజా హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలో మొట్టమొదటిగా
నిర్వహించిన రోల్ బాల్ టోర్నమెంట్ క్రీడాకారులు మరియు ప్రేక్షకులు కేరింతల
మధ్య ఆధ్యంతం ఉత్సహాభరితంగా జరిగినది. అంతర్ 17బాలుర రోల్ బాల్ చాంఫియన్ షిప్
ని చిత్తూరు జిల్లా జట్టు 6-3 స్కోర్ తేడాతో విశాఖపట్నం జిల్లా జట్టుపై ఘన
విజయంతో ట్రోఫీని కైవసం చేసుకుంది. అంతర్ 17 బాలికల విభాగంలో ప్రధమ స్దానం
కృష్ణాజిల్లా, ద్వితీయ స్ధానం నెల్లూరు జట్టు, అంతర్ 14 బాలురలు విభాగంలో
ప్రధమ స్ధానం చిత్తూరు జట్టు, ద్వితీయ స్ధానం కృష్ణా జిల్లాజట్టు, అంతర్ 14
బాలికల విభాగంలో ప్రధమ స్ధానం కృష్ణాజిల్లా జట్టు, ద్వీతియ స్ధానం నెల్లూరు
జిలా జట్లు గెలుపొందాయి. విజేతలకు మంత్రి రోజా గారి చేతుల మీదుగా
క్రీడాకారులకు ట్రోఫీలను అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్కూల్ గేమ్స్
కార్యదర్శి శ్రీ బాబు, టోర్నమెంట్ అబ్జర్వర్ చంద్రకుమార్, టెక్నికల్ కమిటి
శ్రీమన్నారణ, మదన్ మోహన్ ప్రభాకర్, కోచ్ లు వి.జి. ప్రేమ్ నాధ్, ప్రతాప్ ,
కార్తీక్ రోల్ బాల్ సెక్రటరీ అనిల్ కుమార్ రెడ్డి, పి.డిలు శ్రీధర్,
పూర్ణచంద్ర, సురేష్, విజయ్ కుమార్, గణేష్, పివి రమణ పాల్గోన్నారు.