టీ-20 టోర్నీలో ఓటమిపై సచిన్ స్పందన
టి 20 ప్రపంచకప్ లో భాగంగా సెమీస్ లో టీమిండియా ఓడిపోవడం అభిమానులను చాలా
నిరాశకు గురి చేసింది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్
టీమిండియా సెమీస్ ఓటమిపై స్పందించాడు. “ఇంగ్లండ్ సెమీఫైనల్లో మొదట బ్యాటింగ్
చేసిన టీమిండియా భారీ స్కోరును నమోదు చేయలేకపోయింది. తొలుత భారీ స్కోరు
చేయకపోవడం టీమిండియాను దెబ్బకొడితే.. ఆపై బౌలర్లు పూర్తిగా విఫలమవ్వడం జట్టు
కొంపముంచింది. ఒక్క మ్యాచ్ లో ఓడిపోతే టీమిండియాను విమర్శించడం కరెక్ట్ కాదు.
ఇప్పుడు కూడా టి-20లో టీమిండియా బాగానే రాణిస్తుందని.. ఐసీసీ ర్యాంకింగ్స్
లోనూ అగ్రస్థానంలో ఉందన్న విషయం మరిచిపోవద్దు..” అన్నాడు. నెంబర్వన్
స్థానానికి చేరుకోవడం రాత్రికి రాత్రే సాధ్యమయ్యే పని కాదు. అలాంటిది టి20
ప్రపంచకప్ లో ఒక సెమీఫైనల్ మ్యాచ్లో టీమిండియా ఇచ్చిన ప్రదర్శనను చూసి
తప్పుబట్టకూడదన్నారు. ఆటలో గెలుపోటములు సహజమేనన్నారు. అయితే ఒక మేజర్
టోర్నీలో టీమిండియా ఇలాంటి ప్రదర్శన ఇచ్చిందన్న బాధ అభిమానులకు ఉండటం సహజమేనని
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ పేర్కొన్నారు.