కలువాయి వెంకటగిరి ఎక్స్ ప్రెస్..
రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తులను కాపాడి ఆసుపత్రికి చేర్చితే కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు కాపాడిన వ్యక్తికీ 5000 రూపాయలు పారితోషికం అందజేస్తుందని ఆత్మకూరు ఆర్ టీ ఓ రాములు చెప్పారు, కలువాయి లోని శివ సాయి డిగ్రీ కళాశాలలో జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలు కార్యక్రమాన్ని ఆత్మకూరు ఆర్టీవో ఆధ్వర్యంలో జరిగింది, కలువాయి శివ సాయి డిగ్రీ కళాశాలలో జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆత్మకూరు ఆర్టీవో రాములు , కలువాయి ఎస్సై అయ్యప్ప కళాశాల ప్రిన్సిపాల్ నరేంద్ర పాల్గొన్నారు, ఈ సందర్భంగా ఆత్మకూరు ఆర్టీవో మాట్లాడుతూ అతివేగం ప్రమాదకరం అని చెప్పారు. ప్రతి ఒక్కరు హెల్మెంట్ ధరించి వాహనాలను నడపాలని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తులను కాపాడి ఆసుపత్రికి చేర్చితే కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు కాపాడిన వ్యక్తికీ 5000 రూపాయలు పారితోషికం అందజేస్తుందని తెలిపారు. ఈ సందర్బంగా ఎస్సై అయ్యప్ప మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ గమ్యం సురక్షితంగా చేరుకొనే ఆలోచనతో వాహనాలను నడపాలని తెలిపారు, ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని సూచించారు, ఈ కార్యక్రమం నందు విద్యార్థులు డ్రైవర్లు పాల్గొన్నారు.