బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
ఖమ్మం : ఖమ్మం జిల్లాలో బీజేపీ లేదని కొందరు అవమానిస్తున్నారని బీజేపీ రాష్ట్ర
అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. పార్టీ బలమేంటో కార్యకర్తలు చూపాలని
కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. ఖమ్మం జిల్లాలో బీజేపీ నిర్వహించిన ‘జన
సంపర్క్ అభియాన్’ కార్యక్రమంలో పాల్గొన్న బండి.. జిల్లా ప్రజలకు భరోసా
ఇచ్చేందుకు ఈనెల 15న కేంద్ర మంత్రి అమిత్ షా వస్తున్నట్లు ప్రకటించారు.