శాన్ ఫ్రాన్సిస్కో: అమెరికాలోని భారత దౌత్య కార్యాలయంపై ఖలిస్థాన్
వేర్పాటువాదుల దాడిని వ్యతిరేకిస్తూ ప్రవాస భారతీయులు శాంతియుతంగా తమ నిరసనను
తెలియజేశారు. శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత దౌత్య కార్యాలయం వద్దకు పెద్ద
సంఖ్యలో తరలివచ్చి భారతదేశానికి తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. జులై 1న
శాన్ఫ్రాన్సిస్కోలోని భారత దౌత్య కార్యాలయానికి ఖలిస్థాన్ అనుకూలవాదులు
నిప్పంటించడాన్ని ఉగ్రవాద చర్యగా అభివర్ణించారు. అమెరికాలో నెల రోజుల వ్యవధిలో
రెండుసార్లు ఈ తరహా హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి.