చాయ్ మన జీవితంలో భాగమైపోయింది. పొద్దున్నే ఓ కప్పు. పేపర్ చదివాక ఇంకో కప్పు.
బ్రేక్ ఫాస్ట్ తర్వాత మరో కప్పు. అలా రోజుకు ఎన్నో సార్లు టీ తాగడం
చేస్తుంటారు.
పొద్దున్నే ఖాళీ కడుపుతో తాగడం మాత్రం చాలా హానికరం అంటున్నారు పరిశోధకులు.
చాయ్ లోని కెఫీన్ కారణంగా.. ఎసిడిటీలాంటి సమస్య రావచ్చని చెబుతున్నారు. జీర్ణ
వ్యవస్థ మీద కూడా ప్రభావం పడుతుందని హెచ్చరిస్తున్నారు. శరీరానికి ఉత్తేజాన్ని
ఇచ్చే కార్టిసోల్ హార్మోన్ ఉత్పత్తికి ఈ అలవాటు అవరోధం కలిగిస్తుంది. దీంతో
రోజంతా మగతగా అనిపిస్తుంది. టీ తాగడం వల్ల మూత్ర విసర్జన అధికం అవుతుంది.
దీనివల్ల శరీరంలో నీటిశాతం తగ్గిపోయి డీహైడ్రేషన్ మొదలవుతుంది. కప్పులకొద్దీ
చాయ్ తాగేవాళ్లు సహజంగానే మంచినీళ్లు ముట్టుకోరు. దీంతో ఒంట్లో నీటి నిల్వలు
తగ్గిపోతాయి. టీలోని టానిన్స్ అనే రసాయనాలు ఒంట్లోని ఐరన్ ను, క్యాల్షియంను
తగ్గిస్తాయి. దీని వలన పోషక విలువల కొరత ఏర్పడుతుంది. తేనీరులోని రసాయనాలు
పళ్లమీది ఎనామిల్ ని దెబ్బతీస్తాయి. దీంతో దంతాలరంగు మారిపోతుంది. కావున
వీలైనంత వరకు చాయ్ తాగడాన్ని తగ్గించుకొండి.