అనేక రకాల వంటలలో ఉపయోగిస్తారు. అయితే ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగడం వల్ల
ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం..
1.బెల్లంలో కాల్షియం, మెగ్నిషియం, పొటాషియం, జింక్, ఫాస్పరస్ వంటి ఖనిజ
లవణాలతో పాటు బి కాంప్లెక్స్, సి, బి2, ఈ లాంటి విటమిన్లు సమృద్ధిగా లభిస్తాయి.
2. శీతాకాలం మన డైట్ లో బెల్లం చేర్చుకుంటే శరీరంలో వేడి ఉత్పత్తి అవుతుంది.
3. వేడినీటిలో బెల్లం కలుపుకుని తాగిటం వల్ల జీర్ణ వ్యవస్థలో ఎంజైమ్ ల
మెరుగుపరుస్తుంది.
4. జీర్ణక్రియ వేగంగా జరిగేలా చేస్తుంది మరియు కిడ్నీ సమస్యలను కూడా నయం
చేస్తుంది.
5. ప్రతి రోజూ ఉదయం ఖాళీ కడుపుతో బెల్లం నీరు తాగితే ఎంతో మంచిది.
6. బెల్లంలోని పోషకాలు జలుబు, దగ్గు, ఫ్లూ లక్షణాలను తగ్గిస్తాయి.
7.బెల్లంలో ఫినోలిక్ సమ్మేళనాలు ఉంటాయి.ఇవి ఆక్సీకరణ ఒత్తిడితో పోరాడతాయి.
8. బెల్లంలో ఫైబర్ మెండుగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను శుభ్రం చేస్తుంది.
శ్వాసకోశ వ్యవస్థ, ఊపిరితిత్తులు, ఆహార పైపులు, కడుపు, పేగులను కూడా
శుభ్రపరుస్తుంది.
9. బెల్లంలో మెగ్నీషియం, విటమిన్లు బి1, బి6, సీ మెండుగా ఉంటాయి. దీనితో పాటు,
బెల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర రోగనిరోధక
శక్తిని పెంచుతాయి.