జార్ఖండ్ రాష్ట్రం ఖుంటిలోని బిస్రా కళాశాలలో నిర్మించిన టర్ఫ్ హాకీ గ్రౌండ్‌కు అంతర్జాతీయ (ఎఫ్ఐహెచ్ ఫీల్డ్ సర్టిఫికెట్) గుర్తింపు లభించింది. ఈ గుర్తింపుతో ఆటగాళ్లకు తగిన వనరులను అందించడమే కాకుండా వారి ఆన్-గ్రౌండ్ భద్రతను కూడా అందించడానికి సంబంధించిన ఒక అడుగు పడినట్లు హాకీ స్టేడియం నిర్వాహకులు తెలిపారు. అంతర్జాతీయ స్థాయి మ్యాచ్‌లను నిర్వహించడానికి ప్రమాణాలకు అనుగుణంగా ఈ స్టేడియం ఉంటుంది.
అన్ని వసతులను అధ్యయనం చేసుకుని ఫీల్డ్ సర్టిఫికేట్ బుధవారం ఎఫ్ఐహెచ్ గుర్తింపు దక్కిందని గ్రౌండ్ నిర్వాహకులు బుధవారం విడుదల చేసిన అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు.
ఇప్పుడు అంతర్జాతీయ ప్రమాణాల మైదానంలో ప్రాక్టీస్ చేస్తూ తమ ప్రతిభను క్రీడాకారులు మెరుగుపరుచుకోగలరు. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఆదేశాల మేరకు, రాష్ట్రంలోని క్రీడలను సులభతరం చేయడానికి, క్రీడాకారులను తీర్చి దిద్దడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. దీని పరిధిలో క్రీడాకారుల సామర్థ్యాన్ని పెంపొందించడంతోపాటు అంతర్జాతీయ స్థాయి మైదానాల్లో ఆడేందుకు వారిని నిష్ణాతులుగా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో వివిధ జిల్లాల్లో అంతర్జాతీయ స్థాయి టర్ఫ్ హాకీ మైదానాల నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రస్తుతం, రాష్ట్రంలోని సిమ్డేగా, చైబాసాతో సహా పలు జిల్లాల్లో టర్ఫ్ గ్రౌండ్ల నిర్మాణం జరుగుతోంది..