విజయ్ దేవరకొండ, సమంత జంటగా రూపొందుతున్న చిత్రం ఖుషి.శివ నిర్వాణ
దర్శకత్వం వహిస్తున్నారు.మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.
రవిశంకర్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ
భాషల్లో సెప్టెంబరు 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా
శుక్రవారం ఈ చిత్రంలోని టైటిల్ గీతాన్ని విడుదల చేశారు. ‘నెచ్చెలి నెచ్చెలి
వచ్చి విసిరినది వెచ్చని వెచ్చని వల…ముచ్చటగా నను గిల్లి గిచ్చినది కల…
వెన్నెల వెన్నెల వెల్లివిరిసినది కన్నుల కన్నుల మిల…లంగరు దాటి దూకి
పొంగినది అల…అంటూ మొదలయ్యే ఈ పాటని దర్శకుడు శివ నిర్వాణ రచించగా, సంగీత
దర్శకుడు హిషామ్ అబ్దుల్ వాహబ్ స్వయంగా ఆలపించారు. ‘ప్రచార కార్యక్రమాల్లో
భాగంగా ఇప్పటికే విడుదలైన రెండు పాటలు శ్రోతల్ని కట్టిపడేశాయి. మూడో పాటగా
వచ్చిన ఖుషీ… నువ్వు కనపడితే.. కూడా ఆకట్టుకుంటోంది.
ఇందులో విజువల్స్ మరింత ఆకర్షణగా నిలుస్తాయని సినీ వర్గాలు చెబుతున్నాయి.