తయారుచేసిన హైదరాబాద్ సంస్థ
హైదరాబాద్ : గగన్‌యాన్ ప్రాజెక్టులో భాగంగా వ్యోమగాములను అంతరిక్షం నుంచి
సురక్షితంగా భూమికి తీసుకువచ్చే ‘సిమ్యులేటెడ్ క్రూ మాడ్యూల్’ను
హైదరాబాద్‌కు చెందిన మంజీరా మెషిన్ బిల్డర్స్ సంస్థ రూపొందించింది.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలోని ఆ సంస్థ కార్యాలయంలో దీనిని విక్రమ్
సారాభాయి అంతరిక్ష కేంద్రం డైరెక్టర్ ఉన్నికృష్ణన్ నాయర్‌కు అందజేశారు.
ముగ్గురు వ్యోమగాములను సురక్షితంగా భూమిపైకి తీసుకువచ్చేలా ఈ మాడ్యూల్‌ను
రూపొందించినట్లు ఉన్నికృష్ణన్ తెలిపారు. ఇస్రో ఛైర్మన్ సోమ్‌నాథ్ ముంబయి
నుంచి వర్చువల్‌గా మాట్లాడారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఈ మాడ్యూల్‌ను
తయారు చేశారని కితాబిచ్చారు. 2.7 మీటర్ల ఎత్తు, 3.1 మీటర్ల వెడల్పు, 3.5
టన్నుల బరువుండే ఈ మాడ్యూల్‌ను అల్యూమినియం, స్టీల్‌తో 6 నెలల్లో
రూపొందించినట్లు పరిశ్రమ ఎండీ సాయిప్రకాష్ తెలిపారు.