గుంటూరు : రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక చేపట్టిన
సంక్షేమాభివృద్ధి పథకాల వల్ల జరిగిన మేలును ప్రజలకు వివరించి ఆశీస్సులు
కోరేందుకు చేపట్టిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై ముఖ్యమంత్రి వైఎస్
జగన్మోహన్రెడ్డి సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం లో
నిర్వహించిన ఈ వర్క్‌షాప్‌లో ఎమ్మెల్యేలు, వైఎస్సార్సీపీ నియోజకవర్గాల
సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులు, రీజినల్ కో–ఆర్డినేటర్లు తదితరులు
హాజరయ్యారు. కాగా, పథకాల వల్ల ప్రతి ఇంటికీ జరిగిన మేలును వివరించడమే
లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు మే 11న గడపగడపకు మన ప్రభుత్వం
కార్యక్రమాన్నిఎమ్మెల్యేలు, పార్టీ నియోజకవర్గాల సమన్వయకర్తలు ప్రారంభించారు.
సంక్షేమ పథకాల ద్వారా ప్రభుత్వం చేసిన మేలును అక్కాచెల్లెమ్మలకు వివరించడానికి
ఇంటింటికి వెళుతున్న ఎమ్మెల్యేలు, పార్టీ నియోజకవర్గాల సమన్వయకర్తలకు గడపగడపలో
ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ కార్యక్రమం జరుగుతున్న తీరును సమీక్షించి,
ఎమ్మెల్యేలు, సమన్వయకర్తల అభిప్రాయాలను తెలుసుకుని ఆ కార్యక్రమాన్ని మరింత
ప్రభావవంతంగా నిర్వహించడమే లక్ష్యంగా ప్రతినెలా సీఎం వైఎస్ జగన్ వర్క్‌షాప్
నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.*