క్రమ శిక్షణ,బాధ్యతతో కూడిన పని తీరే విజయసోపానం
విద్యా శాఖకే వన్నె తెచ్చిన ఎంఈఓ శ్రీనివాసుల
ఎంఈఓ శ్రీనివాసుల ని ఘనంగా సత్కరించిన మండల ఉపాద్యాయులు
రాపూరు: గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉత్తమ అధికారిగా కలెక్టర్ నుంచి ప్రశంసాపత్రం అందుకున్న రాపూరు మండల విద్యా శాఖ అధికారి గుండవోలు శ్రీనివాసులు ను మండలంలోని ఉపాద్యాయులు,మండల అధికారులు,ఆయన సన్నిహితులు,సిబ్బంది ఆధ్వర్యంలో సన్మాన సత్కారాలతో ఆత్మీయ అభినందన సభ ఆహ్లాదకర వాతావరణం మధ్య అట్టహాసంగా ఏర్పాటు చేశారు.తొలుత అవార్డు గ్రహీత ఎంఈఓ శ్రీనివాసులను ఘనంగా సన్మానించారు..అనంతరం పలువురు వక్తులు మాట్లాడుతూ విద్యా శాఖ అధికారిగా శ్రీనివాసులు బాధ్యతలు చేప్పట్టిన దగ్గర నుంచి జిల్లాలో రాపూరు మండలాన్ని విద్య పరంగా ముందంజలో నిలపాలన్న తపనతో ఉపాద్యాయ వర్గాలన్నింటిని ఏకాతాటి పైకి తీసుకొచ్చి రాపూరు మండల వ్యాప్తంగా కనీవినీ ఎరుగని రీతిలో మేళా, విద్యార్థులకు గ్రిక్స్ వంటి కార్యక్రమాలు నిర్వహించి మండల విద్య శాఖ లో తనకంటూ ఓప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని ఆయన పని తీరు..క్రమ శిక్షణ ను గుర్తించిన అధికారులు గణతంత్ర అవార్డుతో సత్కరించారు.. దింతో మండల ఉపాద్యాయులొనే కాకుండా మండల అధికారులు, ఆయన సన్నిహితులలో సైతం ఆనందం వెల్లువిరిసి ఆయన కు ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో నెల్లూరు నగర మేయర్ స్రవంతి, MEO- 2 జిలాని , మండలంలోని అన్ని పాఠశాల ఉపాద్యాయులు,అధికారులు, సిబ్బంది, ఎంఈఓ సన్నిహితులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు..