విజయవాడ : కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, మాజీ పార్లమెంట్ సభ్యులు రాహుల్
గాంధీకి గన్నవరం విమానాశ్రయంలో ఆదివారం సాయంత్రం ఘనస్వాగతం లభించింది.
రాహుల్ గాంధీ ఖమ్మం పర్యటన సందర్భంగా గన్నవరం విమానాశ్రయానికి ప్రత్యేక
విమానంలో చేరుకున్నారు. ఆయనకి ఏపిసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, ఏఐసీసీ
సెక్రటరి, తెలంగాణా పార్టీ ఇంచార్జ్ మాణిక్యరావు ఠాక్రే, కేంద్ర మాజీ మంత్రి
జేడీ శీలం, సుంకర పద్మశ్రీ తదితరులు రాహుల్ గాంధీకి ఘన స్వాగతం పలికారు.
కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్లు, ఏఐసీసీ సభ్యులు, విజయవాడ నగర, జిల్లా
అధ్యక్షులు, పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు నినాదాలు చేస్తూ
రాహుల్‌కి స్వాగతం పలికారు. అనంతరం రాహుల్ గాంధీ ప్రత్యేక హెలికాప్టర్లో
ఖమ్మం బహిరంగ సభకు బయలుదేరి వెళ్ళారు.