రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్
హైదరాబాద్ : తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో చట్టసభలు ఆమోదించిన బిల్లులను
గవర్నర్లు పెండింగ్‌లో పెడుతున్న వేళ అలాంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా
రాజ్యాంగ సవరణ చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు
వినోద్ కుమార్ అభిప్రాయపడ్డారు. గడువులోగా బిల్లులను ఆమోదించే పరిస్థితి
ఉండాలన్నారు. ఈ మేరకు జాతీయ న్యాయ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ రితురాజ్ ఆవస్థికి
వినోద్ కుమార్ లేఖ రాశారు. రాజ్యాంగంలోని 200వ ఆర్టికల్‌ను సవరించి ‘యాస్
సూన్ యాస్ పాసిబుల్’ పదం స్థానంలో ‘విత్ ఇన్ 30 డేస్’ గా మార్చాలి. ఈ మేరకు
కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేయాలి. యాస్ సూన్ యాస్ పాసిబుల్ అన్న 200వ
ఆర్టికల్‌లోని వెసులుబాటును కొంతమంది గవర్నర్లు తమకు అనుకూలంగా
మార్చుకుంటున్నారు. ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు అసెంబ్లీ, మండలిలో ఆమోదించి
పంపిన బిల్లులను నెలల తరబడి పెండింగ్‌లో పెడుతున్నారు. అలా కాకుండా 30 రోజులకు
సవరించడం వల్ల గవర్నర్లు నిర్ణీత గడువులోగా ఆమోదించడమో, తిరస్కరించడమో, లేక
రాష్ట్రపతికి పంపే పరిస్థితులు ఉంటాయి. సవరణలు చేయకపోతే గవర్నర్లు ఆయా
రాష్ట్రాల ప్రభుత్వాలను ఇబ్బందులకు గురిచేసేందుకు అవకాశం ఉంటుంది.
ప్రజాస్వామ్యయుతంగా, ప్రజల తీర్పుతో ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వాలను రాజకీయంగా
నామినేట్ అయిన గవర్నర్లు ఇబ్బందులకు గురి చేయడం దురదృష్టకరం. గవర్నర్
వ్యవస్థతో తెలంగాణ రాష్ట్రం సహా తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ సహా
దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల ప్రభుత్వాలు ఏదో ఒక విధంగా ఇబ్బంది పడుతున్నాయి.
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పూర్తి సానుకూలంగా ఉన్న గవర్నర్లు బీజేపీయేతర
ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో మాత్రం ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఆర్టికల్
200కు సవరణలు చేస్తే తప్ప ఆయా రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు సాఫీగా పాలన చేసే
పరిస్థితులు ఉండవు. గవర్నర్ల బాధ్యతలు, బిల్లుల ఆమోదానికి నిర్ణీత గడువు
నిర్దేశించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో
ఖాళీగా ఉన్న 1,062 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీని చేపట్టాల్సి ఉంది.
ఉమ్మడి నియామక బోర్డు ఏర్పాటు బిల్లు గవర్నర్ వద్ద ఇంకా పెండింగ్‌లోనే ఉంది.
గవర్నర్లతో ఇలాంటి పరిస్థితులు దేశంలోని పలు రాష్ట్రాల ప్రభుత్వాలు
ఎదుర్కొంటున్నాయి. ఈ పరిస్థితులు పూర్తిగా మారాల్సిన అవసరం ఉందని లా కమిషన్
ఛైర్మన్‌ను లేఖలో కోరారు.