విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నూతనంగా నియమితులైన
సీనియర్ ఐఎఎస్ అధికారి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి శుక్రవారం రాష్ట్ర గవర్నర్
మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలిశారు. మర్యాద పూర్వకంగా జరిగిన ఈ సమావేశంలో
జవహర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విభిన్న సంక్షేమ, అభివృద్ది
కార్యక్రమాలను గవర్నర్ కు వివరించారు. భారత రాష్ట్రపతి హోదాలో తొలిసారి
ఆంధ్రప్రదేశ్ కు వస్తున్న ద్రౌపతి ముర్ము పర్యటనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం
తరుపున ఏర్పాటు చేసిన పౌర సన్మానం ఏర్పాట్లను సిఎస్ గవర్నర్ దృష్టికి
తీసుకువచ్చారు. ఈ నేపధ్యంలో గవర్నర్ హరిచందన్ మాట్లాడుతూ ప్రభుత్వ ఫలాలు
అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా జాగ్రత్తలు వహించాలని సూచించారు. ప్రాధన్యతా
అంశాలను గుర్తించి వాటి పరిష్కారం పట్ల శ్రద్ధ వహించాలన్నారు. మరోవైపు
ప్రభుత్వ పూర్వ ప్రధాన కార్యదర్శి , కాలుష్య నియంత్రణా మండలి అధ్యక్షుడు సమీర్
శర్శ కూడా గవర్నర్ ను మర్యాద పూర్వకంగా కలిసారు. పర్యావరణ సమతౌల్యత సాధనలో
భాగంగా కాలుష్య నియంత్రణకు మండలి చేపడుతున్న చర్యల గురించి గవర్నర్ కు
వివరించారు. కార్యక్రమంలో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా
తదితరుల పాల్గొన్నారు.