విజయవాడ : విజయవాడ రాజ్ భవన్ లో తీర ప్రాంత రక్షణ దళ అధికారులు ఆంధ్రప్రదేశ్
గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను మర్యాద పూర్వకంగా కలిసారు. తూర్పు సముద్ర
మండలి కోస్ట్ గార్డు కమాండర్, అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఎస్ పరమేష్, ఎపి కోస్ట్
గార్డ్ కమాండర్, డిప్యూటి ఇన్ స్పెక్టర్ జనరల్ యోగీందర్ ఢాకా గవర్నర్ ను
కలిసిన వారిలో ఉన్నారు. తూర్పు సముద్ర తీరంలో తీర ప్రాంత రక్షణ దళం చేపడుతున్న
భధ్రతా చర్యలతో పాటు విభిన్న అంశాలను వీరు గవర్నర్ కు వివరించారు. విశాఖ
తీరంలోని తమ కేంద్రాన్ని సందర్శించాలని విన్నవించారు. సరిహద్దు కవ్వింపు
చర్యలను సమర్ద వంతంగా తిప్పి కొట్టాలని ఈ సందర్భంగా గవర్నర్ హరిచందన్
సూచించారు. దేశ భద్రత పట్ల రాజీ లేని ధోరణిని ప్రదర్శించాలన్నారు. ఈ సమావేశంలో
గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా, తదితరులు పాల్గొన్నారు.