బెంగళూరు : మాజీ మంత్రి, కల్యాణ రాజ్య ప్రగతి పార్టీ ఎమ్మెల్యే గాలి
జనార్దనరెడ్డి, ఆయన భార్య అరుణ పేరుతో ఉన్న 124 ఆస్తుల్లో 100కు పైగా జప్తు
చేసుకోవాలని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.
జనార్దనరెడ్డిపై ఉన్న క్రిమినల్ కేసుల విచారణ పూర్తయ్యే వరకూ ఆస్తులను
జప్తులోనే ఉంచుకోవాలని అధికారులను ఆదేశించింది. ఆస్తుల జప్తునకు అనుమతులెందుకు
ఇవ్వడం లేదని గత ప్రభుత్వాన్ని అప్పట్లో న్యాయస్థానం ప్రశ్నించింది. దీనిపై
ఎటువంటి అభ్యంతరం లేదని ప్రభుత్వం ప్రమాణ పత్రం దాఖలు చేయడంతో కోర్టు ఈ
ఆదేశాలు జారీ చేసింది. ఇళ్లు, ఇంటి స్థలాలు, ఫ్లాట్లు తదితరాలను ఆయన కర్ణాటక,
తెలంగాణలో కొనుగోలు చేసినట్లు దర్యాప్తు బృందం గుర్తించింది. అక్రమ గనుల
తవ్వకాలతోనే వీటిని కొన్నట్లు అధికారులు న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు.
గాలి జనార్దనరెడ్డి తన ఆస్తుల వివరాలను గత ఎన్నికల సమయంలో వెల్లడించారు. ఆ
సందర్భంలో ఆయన మాట్లాడుతూ ‘ఆస్తులను జప్తు చేసినా భయపడను. కారాగారంలో
ఉన్నప్పుడు రూ.1200 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేశారు. న్యాయ పోరాటం చేసి,
జప్తును రద్దు చేయించుకున్నా’ అని తెలిపారు