న్యూజిలాండ్ టార్గెట్ 350
శుభ్‌మన్ గిల్ ద్విశతకం.. న్యూజిలాండ్ టార్గెట్ 350 తొలి వన్డేలో టీమిండియా నిర్ణీత ఓవర్లలో 349రన్స్ చేసింది. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ డబుల్ సెంచరీతో చెలరేగాడు. 145 బంతుల్లోనే అతను రెండొందలు సాధించాడు. ఫోర్లు, సిక్సర్లతో కివీస్ బౌలర్లపై విరుచుకుపడిన అతను వన్డేల్లో తొలి ద్విశతకం బాదాడు. ఫెర్గూసన్ బౌలింగ్‌లో వరుసగా హ్యాట్రిక్ సిక్స్‌లు బాది డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. విశేషం ఏంటంటే.. ఈ మ్యాచ్‌లో అతను సిక్సర్‌తోనే 50, 150, 200 పరుగుల మార్క్ అందుకున్నాడు. చివరి ఓవర్లో భారీ షాట్‌కు ప్రయత్నించిన గిల్ 208 పరుగులకు వెనుదిరిగాడు. దాంతో, భారత్ 8 వికెట్ల నష్టానికి 349 పరుగులు చేసింది. కివీస్ బౌలర్లలో షిప్లే, మిచెలె రెండు వికెట్లు తీశారు. ఫెర్గూసన్, టిక్నర్, శాంట్నర్‌కు తలా ఒక వికెట్ దక్కింది.
రోహిత్ శర్మ (34), విరాట్ కోహ్లీ (8), ఇషాన్ (5) స్వల్ప స్కోర్‌కే పెవిలియన్ చేరారు. దాంతో గిల్ ఇన్నింగ్స్ నిర్మించే బాధ్యత తీసుకున్నాడు. సూర్యకుమార్, పాండ్యాతో కలిసి హాఫ్ సెంచరీ భాగస్వామ్యం నిర్మించాడు. తన కళాత్మక షాట్లతో ఉప్పల్ స్టేడియాన్ని హోరెత్తించాడు.
అతి పిన్న వయస్కుడు గిల్
డుబల్ సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా శుభ్‌మన్ గిల్ మరో రికార్డు సాధించాడు. ఈ రోజుకు గిల్ వయసు 23ఏళ్ల 123 రోజులు అంతే. ఇషాన్ కిషన్ 24 ఏళ్ల 145 రోజులతో. రోహిత్ శర్మ 26 ఏళ్ల 186 రోజులతో వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. అంతేకాదు వన్డేల్లో డబుల్ సెంచరీ బాదిన ఐదో భారత ఆటగాడిగా గిల్ రికార్డు క్రియేట్ చేశాడు.