వెలగపూడి : గుంటూరు- కందుకూరు ప్రాంతాల్లో జరిగిన జరిగిన తొక్కిసలాట ఘటనలకు
సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు విశ్రాంత
న్యాయమూర్తి జస్టిస్ బి.శేషశయనారెడ్డి నేతృత్వంలో చేపట్టిన విచారణ గడువును
పొడిగించింది. విచారణ కమిషన్ గడువును మరో నెలరోజుల పాటు పొడిగిస్తున్నట్లు
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్ జవహర్ రెడ్డి ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు, కందుకూరు ప్రాంతాల్లో జరిగిన తొక్కిసలాట ఘటనలకు
సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్
బి.శేషశయనారెడ్డి నేతృత్వంలో విచారణ కమిషన్ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
ఆ కమిషన్ తొక్కిసలాటల ఘటనలకు దారితీసిన పరిస్థితులేంటి?, వాటికి బాధ్యులెవరు?,
ఏర్పాట్లలో లోపాలేమైనా ఉన్నాయా?, అనుమతుల ఉల్లంఘన జరిగిందా?, జరిగితే దానికి
బాధ్యులెవరు? అన్న అంశాలపై విచారణను ప్రారంభించింది. ఈ క్రమంలో రాష్ట్ర
ప్రభుత్వం విచారణకు సంబంధించి ఈరోజు కీలక ఉత్తర్వులను జారీ చేసింది. విచారణ
గడువును మరో నెల రోజుల పాటు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
కె.ఎస్ జవహర్ రెడ్డి ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 2023 మార్చి 17వ తేదీ వరకూ
విచారణ కమిషన్ గడువును పొడిగించారు. మార్చి 17 తేదీన లేదా అంతకు ముందుగా
గుంటూరు- కందుకూరు తొక్కిసలాట ఘటనలపై నివేదిక ఇవ్వాలంటూ విచారణ కమిషన్కు
ప్రభుత్వం సూచనలు జారీ చేసింది. అసలు ఏం జరిగిదంటే : 2022 డిసెంబర్ 27న టీడీపీ
అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లా కందుకూరులో బహిరంగ
సభను ఏర్పాటు చేశారు. ఆ బహిరంగ సభకు వేలాదిమంది కార్యకర్తలు, స్థానికులు
తరలిరాగా ఒక్కసారిగా తొక్కిసలాట జరిగి 8 మంది మృతి చెందారు. అలాగే, గుంటూరులో
ఉయ్యూరు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జనతా వస్త్రాల పంపిణీ కార్యక్రమం
సందర్భంగా తొక్కిసలాట జరిగి షేక్ బీబీ, గోపిదేశీ రమాదేవి, సయ్యద్ ఆసియా మృతి
చెందారు. ఈ రెండు ఘటనలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం విశ్రాంత న్యాయమూర్తి
జస్టిస్ శేషశయనారెడ్డి ఆధ్వర్యంలో విచారణ కమిటీని నియమించింది.